BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

Select Suryaa Now
శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం

నిజాంపేట్ మేజర్ న్యూస్ : నిజాంపేటలో శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన మెగా ఉచిత ఆరోగ్య శిబిరానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. నిజాంపేట, పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు ప్రజలు ఈ శిబిరానికి హాజరై వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రముఖ వైద్యులు, మెడికేర్ క్లినిక్ అధినేత డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు నేతృత్వంలోని వైద్య బృందం ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సేవలు అందించింది. ప్రముఖ పారిశ్రామికవేత్త గర్నెపూడి రాధాకృష్ణమూర్తి ఈ వైద్య శిబిరాన్ని లాంఛనంగా ప్రారంభించారు. 

ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు మాట్లాడుతూ నిజాంపేట ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ప్రతినిధులను ఆయన అభినందించారు. ఈ శిబిరంలో మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకు పరీక్షలతో పాటు ఎముకల ఆరోగ్యం, కంటి పరీక్షలు తదితర వైద్య సేవలు అందించారు. ప్రజలు తమ ఆరోగ్య పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ శిబిరం ఎంతగానో ఉపయోగపడింది. శిబిరానికి హాజరైన వారందరికీ వాటర్ బాటిళ్లను అందించడంతో పాటు వైద్యులు, వైద్య సిబ్బందికి భోజనం, ఫలహార ఏర్పాట్లను సంఘం ప్రతినిధులు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో సంఘ ప్రతినిధులు డాక్టర్ పోడూరి శ్రీనివాసరావు, వారణాశి రమా వివేకానంద, పమ్మి సత్యాజీ, ఎల్‌ఎంఎల్ శాస్త్రి, కులకర్ణి రాఘవేంద్ర, కరుణాకర్, నాగరమేష్, కులకర్ణి రామారావు తదితరులు పాల్గొని తమ సహాయ సహకారాలు అందించారు. 

సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు రామవరపు సుధాకర్ కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. సంఘ మహిళా విభాగ సభ్యులు మారేపల్లి భువనేశ్వరి, ఛాయాదేవి, కళ్యాణి, రమణి, కుమారి, అనిత, జయశ్రీ, గాయత్రీ, సత్యవాణి తదితరులు పాల్గొని సేవా కార్యక్రమాల్లో చురుగ్గా భాగస్వాములయ్యారు. నిజాంపేట, పరిసర ప్రాంత ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చిన డాక్టర్ వాసిరెడ్డి నరసింహారావు, ఆయన సతీమణి వాసిరెడ్డి గిరిజ దంపతులను సంఘ అధ్యక్షులు ఎన్‌వీఎల్ నరసింహారావు అభినందించారు. భవిష్యత్తులో హోమియోపతి, ఆయుర్వేదం తదితర వైద్య విధానాలకు సంబంధించిన శిబిరాలను కూడా నిర్వహించి ప్రజలకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించడమే లక్ష్యంగా శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ముందుకు సాగుతుందని సంఘ ప్రతినిధులు పేర్కొన్నారు.