BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ

Select Suryaa Now
పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం :  ఎమ్మెల్యే గాంధీ

హఫీజ్ పెట్,మేజర్ న్యూస్ : శేరిలింగంపల్లి డివిజన్‌ పరిధిలోని పాపిరెడ్డి కాలనీ  రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షాకాలంలో తరచూ ఏర్పడుతున్న నీటి నిల్వ సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే దిశగా చర్యలు చేపట్టినట్లు ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు.రూ.98 లక్షల వ్యయంతో 2.25 లక్షల లీటర్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న వర్షపు నీటి నిల్వ సంపు పనులను ఆదివారం  ఎమ్మెల్యే  ఆరెకపూడి గాంధీ పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి వర్షాకాలంలో అండర్‌పాస్‌ వద్ద నీరు నిలిచిపోవడంతో ప్రజలు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

 ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో నీటి నిల్వ సంపు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే నీటి నిల్వ సమస్య తగ్గడంతో పాటు పాపిరెడ్డి కాలనీ, హుడా కాలనీల మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని చెప్పారు.ప్రయాణికులు, వాహనదారులకు ఇబ్బందులు తగ్గి ప్రయాణ సమయం, ఇంధనం ఆదా అయ్యే అవకాశం ఉందన్నారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడవద్దని స్పష్టం చేశారు. ప్రజలకు శాశ్వత ప్రయోజనం చేకూరేలా పనులు పూర్తి చేయాలని సూచించారు.