అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి
మరిపెడ, మేజర్ న్యూస్, రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అర్హులైన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వీసారపు శ్రీపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణ పరిధిలోని పదవ వార్డులో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ వరంగల్- ఖమ్మం- నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఇంకా ఓటరుగా నమోదు చేసుకొని పట్టభద్రుల కోసం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటుచేశామని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తూ ఓటరు నమోదుకు గ్రాడ్యుయేట్స్ కు అవగాహన కల్పిస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో రంజిత్ కుమార్,కిరణ్, తరుణ్, రాజ్ కుమార్, సందీప్, వికాస్, రాజా, రాకేష్ తదితరులు ఉన్నారు.
రిపోర్టర్: చందర్ , మహబూబాబాద్ జిల్లా