BREAKING
నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ

పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

Select Suryaa Now
 పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

                                           మియాపూర్, మయూరి నగర్‌లో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
మియాపూర్,మేజర్ న్యూస్ : బీజేపీ శేరిలింగంపల్లి నియోజకవర్గం ఆధ్వర్యంలో మియాపూర్ డివిజన్ విద్యా కాలనీలో బీజేపీ నాయకుడు సమ్మెట ప్రసాద్ నివాసంలో, మయూరి నగర్ డివిజన్ లక్ష్మీ ఇంపీరియల్ గేటెడ్ కమ్యూనిటీలో పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. లక్ష్మీ ఇంపీరియల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ 139వ ఎపిసోడ్‌ను వీక్షించారు.

ఈ కార్యక్రమానికి  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు, రాష్ట్ర ఇన్‌ఛార్జ్ రేఖా శర్మ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతం రావు, రాష్ట్ర అధికార ప్రతినిధి, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రవికుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎన్. రామచంద్రరావు మాట్లాడుతూ పట్టభద్రులు తమ ప్రజాస్వామ్య హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లుగా నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రేఖా శర్మ, గౌతం రావు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. 

రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు స్థానిక సమస్యల పరిష్కారానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, రవీందర్ రావు, కసిరెడ్డి భాస్కర్ రెడ్డి, నాగులు గౌడ్, సమ్మెట ప్రసాద్, సీతారామరాజు, గణేష్ ముదిరాజ్ తదితర నాయకులు, వివిధ మోర్చాల ప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.