BREAKING
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం

Select Suryaa Now
కూటమి చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబుకి బ్రహ్మరథం : 28వ వార్డులో జన ప్రభంజనం మధ్య ఎన్నికల ప్రచారం : పచ్చిపాల రామకృష్ణ ఆచారి,తులసి దంపతులు ఆత్మీయ స్వాగతం

 

మదనపల్లె,మేజర్ న్యూస్ : మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా 28వ వార్డులో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి గుండ్లపల్లి శ్రీరామ కుమార్ (చినబాబు) విస్తృత ప్రచారం నిర్వహించారు.భారీ జనసందోహం మధ్య జరిగిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు హాజరయ్యారు.28వ వార్డులో ఏకగ్రీవమైన కౌన్సిలర్ అభ్యర్థి,టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి రామకృష్ణతో కలిసి చినబాబు ప్రజలను కలుసుకుంటూ ప్రచారం సాగించారు.ఈ సందర్భంగా వార్డులోని ప్రజలతో మమేకమవుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.నాయకులుకార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొనడంతో ప్రచార కార్యక్రమం సందడిగా సాగింది.మదనపల్లె మున్సిపాలిటీ అభివృద్ధే లక్ష్యంగా ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్నామని కూటమి నాయకులు తెలిపారు.ఈ సందర్భంగా శ్రీరామ్ చినబాబు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు.మదనపల్లి పట్టణం మరింత అభివృద్ధి సాధించాలంటే కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.ఒక అవకాశం ఇస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.అనంతరం టిడిపి రాష్ట్ర కార్యదర్శి పచ్చిపాల తులసి,సుగవాసి ప్రసాద్ బాబులు మాట్లాడుతూ కూటమి పాలన పట్ల ప్రజలు పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని,సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్నారన్నారు.2024 శాసనసభ ఎన్నికల ఫలితాలే మున్సిపల్ ఎన్నికల్లో పునరావృతం అవుతాయని వారు ధీమా వ్యక్తం చేశారు.కావున త్వరలో జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో 48 వార్డులలో కూటమి అభ్యర్థులను చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబును అఖండ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్,రాజంపేట పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్,పట్టణ అధ్యక్షులు నాదెళ్ల అరుణ్ తేజ,రాష్ట్ర నాయకులు రాటకొండ మధుబాబు,ప్రణవ్ రాయల్,శ్రీకాంత్,మహబూబ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి