అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా.... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్
తిరుపతి, మేజర్ న్యూస్:
39 వ డివిజన్ కార్పొరేటర్ గా ప్రజలంతా ఓట్లేసి తనను గెలిపిస్తే డివిజన్లోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసి చూపిస్తానని ఆ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి
డి పింకీ జైన్ హామీ ఇచ్చారు. ఆదివారం కాళి కమ్మ గుడి వీధి 39 వ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాలలో టిడిపి, బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి పింకీ జైన్ ఇంటింటా ప్రచారం చేశారు. తిరుపతిలో ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు నేతృత్వంలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో తనకు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించాలని మీకు అందుబాటులో ఉండి సేవ చేసే భాగ్యం కల్పించాలని ఆమె కోరారు. మీ ఇంటి ఆడపడుచు గా, ఒక సోదరిగా, ఒక అక్కగా పిలిస్తే పలుకుతూ అందరికీ అందుబాటులో ఉంటానని ఆమె తెలిపారు. కావున ఒకటో తేదీ జరగబోయే పోలింగ్ రోజున జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె ఓటర్లను కోరారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీ సీనియర్ నేత దినేష్ జైన్, దామోదర్, కిషోర్, జిగర్, భవిక్, జనసేన టిడిపి కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
H. Dwaraka, staff reporter, tirupati
9705347341.