BREAKING
ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –26 అక్టోబర్ 2026 అంబాజీపేటలో శ్రీ విజయ భేతాళస్వామి వాహన మహోత్సవం.. గుగులోతు రామస్వామి నాయక్ కు ఘన సన్మానం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి-డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీపాల్ రెడ్డి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు

ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

Select Suryaa Now
ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

జీడిమెట్ల మేజర్ న్యూస్ : దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ఓటు హక్కు సంరక్షణకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఏఐసీసీ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా చేపట్టిన ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ కూన శ్రీశైలం గౌడ్ పాల్గొన్నారు. ఏఐసీసీ పరిశీలకులు ఎస్. శరత్‌తో కలిసి ఆయన సమావేశంలో పాల్గొని పార్టీ నాయకులతో చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్ సూచనల మేరకు నిర్వహించిన ఈ సమావేశంలో ఓటు హక్కు పరిరక్షణ, ఓటర్లలో అవగాహన పెంపొందించడం, ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. 

అలాగే నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి పార్టీ శ్రేణులను పెద్ద సంఖ్యలో సమీకరించడం, కార్యక్రమ విజయవంతానికి అనుసరించాల్సిన వ్యూహాలు, భవిష్యత్ కార్యాచరణపై నాయకులు సమాలోచనలు జరిపారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనదని, దాని పరిరక్షణ కోసం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని సమావేశంలో నేతలు సూచించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మనకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, మున్నూరుకాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం, కార్పొరేషన్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్, హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఒడితల ప్రణవ్ బాబు, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పురుమల్ల శ్రీనివాస్, ఆల్‌ఫోర్స్ నరేందర్ రెడ్డి తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.