BREAKING
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు గంజాయి రవాణా చేస్తున్న మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్-ఆరు లక్షల విలువైన 12 కిలోల గంజాయి పట్టివేత సాయినగర్ కాలనీలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ఎన్‌టీఆర్‌ నగర్‌లో కిడ్నాప్‌ కలకలం.... గంటల్లోనే కిడ్నాప్‌నకు గురైన వ్యక్తిని గుర్తించిన గచ్చిబౌలి పోలీసులు . జీహెచ్‌ఎంసీ మహిళా కార్మికులకు చీరల పంపిణీ చేసిన బలరాం యాదవ్ పట్టభద్రులు ఓటర్లుగా నమోదు కావాలి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాదాపూర్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య! వికసిత్ భారత్ కోసం యువత కృషి చేయాలి: కసిరెడ్డి సింధూరెడ్డి పాపిరెడ్డి కాలనీ రైల్వే అండర్‌పాస్ వద్ద వర్షపు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం : ఎమ్మెల్యే గాంధీ నాలాల విస్తరణ పనులు వేగవంతం చేయాలి రూ.79.58 కోట్లతో శేరిలింగంపల్లిలో నాలాల విస్తరణ పనులు.. ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఘనంగా 'రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భావ ఉత్సవం' తిరుపతి లో జోరందుకున్న ప్రచార హోరు... కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యం... శ్రీ కామాక్షి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం చింతల్‌లో లబ్ధిదారులకు అందజేసిన మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ సమరశంఖం :కరీంనగర్‌లో ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ సమావేశం.. పాల్గొన్న కూన శ్రీశైలం గౌడ్

32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం.. టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి...

Select Suryaa Now
32వ డివిజన్ ను అన్ని విధాలుగా అభివృద్ది చేయడమే లక్ష్యం..  టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే   వెంకట కీర్తి...

తిరుపతి, మేజర్ న్యూస్ :

తిరుపతి నగరపాలక సంస్థ పరిధి లో ఎన్నికల ప్రచారంలో భాగంగా 32వ డివిజన్‌లో టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి బట్టే వెంకట కీర్తి ఆదివారం ఎస్డి లేఅవుట్, ఈటి స్ట్రీట్ ప్రాంతాలలో  విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లను ఆత్మీయంగా కలిసి సీరియల్ నెంబర్ 1 సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా బట్టే వెంకట కీర్తి మాట్లాడుతూ, ప్రజలు తనను ఆశీర్వదించి గెలిపిస్తే  32వ డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానన్నారు. డివిజన్‌లో నెలకొన్న సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తూ, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే ప్రజాప్రతినిధిగా సేవలందిస్తానని హామీ ఇచ్చారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాలు, రహదారుల మెరుగుదలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తానని తెలిపారు. అభివృద్ధి, పారదర్శక పాలన కోసం సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని డివిజన్ ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి  పార్టీ నాయకులు,  కార్యకర్తలు,  ప్రచారం నిర్వహించారు.

H. Dwaraka, staff reporter 
9705347341.