గత అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి-- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి
నరసాపురం, మేజర్ న్యూస్: గత వైసిపి పాలనలో నరసాపురం పట్టణంలో చేసిన అభివృద్ధిని చూసి వైసీపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ప్రసాదరాజు కోరారు. ఆదివారం పట్టణంలోని మూడు ఐదు వార్డులతోపాటు పలు ప్రాంతాల్లో చైర్ పర్సన్ అభ్యర్థి కావలి రామ సీత, కౌన్సిలర్ అభ్యర్థుల విజయం కోరుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వ పాలనను, కూటమిపాలనను ప్రజలు అంచనా వేసుకుని ఓట్లు వేయాలను కోరారు. వైసిపి పాలనలో సామాన్య మధ్య తరగతి ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని, కూటమిపాలనలో సామాన్యుడు బతకలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉన్నదని విమర్శించారు. ప్రజలకు అన్నీ తెలుసు వాస్తవ పరిస్థితులను గమనించి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో చైర్ పర్సన్ అభ్యర్థి కావలి రామ సీత, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ బర్రె శ్రీ వెంకటరమణ, కౌన్సిలర్ అభ్యర్థులు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.