జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం
ఉండి, మేజర్ న్యూస్: ఉమ్మడి కూటమి బలపరిచిన జనసేన పార్టీ ఉండి.1 ఎంపీటీసీ అభ్యర్థి అడపా శివ శంకర గణేష్ కుమార్ ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు వెంటరాగా ఇంటింటికి తిరుగుతూ గ్లాస్ గుర్తుపై ఓటు వేయాలంటూ ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా గణేష్ కుమార్ మాట్లాడుతూ తాను జనసేన పార్టీలో క్రియాశీల సభ్యుడిగా పని చేస్తున్నానని పార్టీ అభ్యున్నతికి కష్టపడి పని చేశాను అని తన కష్టానికి పార్టీ పెద్దలు ఎంపీటీసీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించారని తాను చేతివృత్తిదారుడునని తనకు వార్డులో ఉన్న సమస్యలు తెలుసునని సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని ఆయన అన్నారు. ఓటర్లు తనను నమ్మి ఓటు వేయాలని ఆయన కోరారు. ప్రజాసేవ చేయాలని దృఢ సంకల్పంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు అనుగుణంగా ముందుకు వెళుతున్నానని ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ సేవ చేస్తానని ఆయన ఓటర్లకు భరోసా ఇచ్చారు. కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా తనకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు జీవి సత్యనారాయణ, యర్ర రవి, నాని, హరి, శ్రీనివాస్, రాము తదితరులు తనతో పాటు ఉన్నారు.