ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి-- సిఐ రఘు
నరసాపురం, మేజర్ న్యూస్ :మున్సిపల్ ఎన్నికలు ఎన్నికల సంఘం నిబంధన మేరకు శాంతియుతంగా, ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని పట్టణ సీఐ రఘు కోరారు. ఆదివారం చిన మామిడిపల్లిలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీలో ఉన్న అభ్యర్థులు, వారి అనుచరులు, అందరూ నిబంధనల మేరకే ప్రచారం నిర్వహించాలని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు అన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినమైన శిక్షలు ఉంటాయని అన్ని పార్టీల అభ్యర్థులు, వారి అనుచరులు కూడా పోలీసులకు సహకరించి నిబంధనలు పాటించాలన్నారు. ఎస్ఐ లు, ప్రేమ రాజ్, ముత్యాలరావు తదితరులు మాట్లాడారు.