BREAKING
25వ వార్డులో నూరి ఇక్బాల్ ప్రచార జోరు వర్షంలోనూ తగ్గని ప్రచార జోరు.. నాగరాజుకు కార్యకర్తల అండ దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి జనసేన ఎంపీటీసీ అభ్యర్థి ఇంటింటి ప్రచారం కూటమి అభ్యర్థుల గెలుపు కోరుతూ దేశం నేత నాయుడు విస్తృత ప్రచారం అంగరంగ వైభవంగా శ్రీనివాసుని కళ్యాణం ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలి-- సిఐ రఘు కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులకు సీట్లు --గెలిపిస్తే ఏలూరు మరింత అభివృద్ధి నూజివీడు పట్టణానికి సకల హంగులతో నగర శోభ — మంత్రి కొలుసు పార్థసారథి — బిజెపి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ 33 వ వార్డులో ప్రచారం గత అభివృద్ధిని చూసి ఓట్లు వేయండి-- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి ఖండవల్లిలో కూటమి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటింటా ఎన్నికల ప్రచారం రూ.195 కోట్లతో నిడదవోలు పట్టణాభివృద్ధి:మంత్రి కందుల దుర్గేష్ ఎస్ జి ఎఫ్ రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు పందలపాక విద్యార్థులు ఎంపిక జనసేన పార్టీ నుండి వైయస్సార్ పార్టీలో చేరికలు నేటి పంచాంగం 26 అక్టోబర్ 2026

కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులకు సీట్లు --గెలిపిస్తే ఏలూరు మరింత అభివృద్ధి

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికల్లో సమర్థులకు సీట్లు  --గెలిపిస్తే ఏలూరు మరింత అభివృద్ధి

ఏలూరు, సూర్య న్యూస్ …కార్పొరేషన్‌ ఎన్నికల్లో సమర్ధులకు అభ్యర్ధిత్వం ఇవ్వడం జరిగిందని, వారికి అండగా నిలిచి ఆశీర్వదిస్తే భవిష్యత్తులో ఏలూరు నగరం మరింత అభివృద్ధి చెందడానికి అవకాశాలు మెరుగుపడతాయని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కూటమి మేయర్‌ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడుతో కలిసి స్థానిక 34, 35 డివిజన్‌ల పరిధిలో ఆయన విస్త్రృత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అభ్యర్ధులతో కలిసి ఇంటింటికీ వెళ్ళి ఓటర్లను కలిసి ఆత్మీయంగా పలకరించి ఓట్లు వేసి అభ్యర్ధులను ఆశీర్వదించాలని కోరారు. కరపత్రాలను పంపిణీ చేశారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొన్నారు. ఎన్నికలు ముగిసి నూతన పాలకవర్గం బాధ్యతలు చేపట్టగానే అన్ని డివిజన్‌లలో ప్రగతి పనులను చేపడతామని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ అభివృద్ధి మంత్రంతో ఏలూరు కార్పొరేషన్‌ ఎన్నికలల్లో ప్రజల ఓట్లు అడుగుతున్నట్లు స్పష్టం చేశారు. శనివారపు పేట పరిధిలోని 4 డివిజన్‌లలో కూటమి అభ్యర్దులను గెలిపించాలని కోరారు. మేయర్‌ అభ్యర్ధి రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గడిచిన రెండున్నరేళ్ళలో మన కళ్ళెదుట కనపడుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ పరిశీలకులు మీరావలీ, జనసేన సీనియర్‌ నాయకులు నారా శేషు, టీడీపీ జిల్లా మీడియా కో-ఆర్డినేటర్‌ చల్లా వెంకట సత్యవరప్రసాదరావు, 34వ డివిజన్‌ కూటమి టీడీపీ అభ్యర్ది గునిపూడి శ్రీనివాసరావు, 35వ డివిజన్‌ కూటమి టీడీపీ అభ్యర్ది వాసా సత్యనారాయణ, నాయకులు రెడ్డి నాగరాజు, లంకపల్లి మాణిక్యాలరావు, సోమిశెట్టి రాము, బొద్దాని శ్రీను, నడపన దాన భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.