నూజివీడు పట్టణానికి సకల హంగులతో నగర శోభ — మంత్రి కొలుసు పార్థసారథి — బిజెపి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ 33 వ వార్డులో ప్రచారం
నూజివీడు, మేజర్ న్యూస్ : పంచాయితీ నాటి స్థితి గతులతో కునారిల్లుతున్న నూజివీడుకు నగర శోభను సంతరించే విధంగా పట్టణ రూపురేఖలను మారుస్తానని రాష్ట్ర గృహ నిర్మాణ,సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక 33 వ వార్డులో కౌన్సిలర్ గా పోటీచేస్తున్న కూటమి బలపర్చిన బిజెపి అభ్యర్థి మాగంటి వెంకటేశ్వరమ్మ ,టీడీపీ చైర్మన్ అభ్యర్థి బర్రె ఇళయరాజా విజయాన్ని కాంక్షిస్తూ స్థానికులతో ఆయన సమావేశమయ్యారు.ee సందర్భంగా మంత్రి సారథి మాట్లాడుతూ ఇరుకైన రహదారులు,అభివృద్ధికి నోచుకోని డ్రైనేజీలు,అడ్రస్ లేని పార్కులు,రోడ్లు,విద్యుత్ లేని కాలనీలతో ఇప్పటికీ పంచాయితీ నాటి పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే నూజివీడు రూపురేఖలు మార్చే దిశగా కార్యాచరణ ప్రారంభించామన్నారు.దీనిలో భాగంగా సకల సౌకర్యాలతో విశాలమైన పార్కులు,ఇండోర్ స్టేడియం,పట్టణం నలువైపులా డివైడర్లు ఏర్పాటు,ట్రాఫిక్ క్రమబద్ధీకరణ,కాలనీలకు మౌలిక వసతుల కల్పన,పక్కా డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టామన్నారు.రాబోయే రోజులలో మరిన్ని నిధులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో మంజూరు చేయించి ఎవరూ ఊహించని విధంగా నూజివీడుకు నగర శోభను తీసుకువస్తామని కొలుసు పార్థసారథి తెలిపారు.నూజివీడు అభివృద్ధిలో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు.ఇందుకు కూటమి అభ్యర్థులను ఆశీర్వదించి విజయాన్ని అందించాలని విజ్ఞప్తి చేశారు.
33 వ వార్డు సమస్యలపై ప్రత్యేక దృష్టి:
మున్సిపల్ పరిధిలో 33 వ వార్డులో సమస్యలను స్థానికులనుంచి మంత్రి సారథి అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ హాలు,స్థానిక దేవాలయాలకు ధూప దీప నైవేద్యాలకు భరణం,మంచినీటి వసతి,విద్యుత్ దీపాల ఏర్పాటు,ఇండ్ల స్థలాలు, రహదారుల విస్తరణపై మంత్రి సానుకూలంగా స్పందించి వాటిని సత్వరమే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.ఈ సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథితో పాటు బిజెపి అభ్యర్థిని మాగంటి వెంకటేశ్వరమ్మ ( వాణి టీచర్),బిజెపి నాయకులు మల్లెపూడి రాజశేఖర్,మాటూరి రవికాంత్,బోను అప్పారావు,మాగంటి వాసు మాస్టారు,టీడీపీ,జనసేన నాయకులు,స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.