దర్భరేవు డ్రైన్ సమస్యను పరిష్కరించాలి -- సిపిఎం జెడ్పిటిసి అభ్యర్థి కౌరు లక్ష్మి
నరసాపురం రూరల్, మేజర్ న్యూస్ :మండలం లోని దర్భరేవు డ్రైన్ మురుగు నీరు సక్రమంగా లాగకపోవడం వల్ల స్థానిక పంట పొలాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని సిపిఎం జడ్పీటీసీ అభ్యర్థి కవురు లక్ష్మి డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని చామకూరి పాలెం పంచాయతీ పరిధిలోని మోడీ గ్రామంలో ఆమె ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కవురు లక్ష్మి ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను నేరుగా కలుసుకుని, వారి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూదర్భరేవు డ్రైన్ మురుగు నీటి నిల్వ కారణంగా రైతులు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో పంట పొలాల రక్షణతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న సాగు నీరు, త్రాగు నీరు సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. మండలంలో నెలకొన్న ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సిపిఎం పనిచేస్తుందని, ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, కార్యకర్తలు కవురు పెద్దిరాజు, తెలగంశెట్టి సత్యనారాయణ, జల్లి రామ్మోహన్ రావు, పెచ్చేట్టి నరసింహ రావు, అంజమ్మ, గుబ్బల నర్సిమ్మ, కవురు లక్ష్మి దుర్గా, గుబ్బల నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.