మామపై కత్తితో అల్లుడి దాడి
సూర్య మల్లాపూర్:కుటుంబ కలహాల నేపథ్యంలో మామపై కత్తితో అల్లుడు దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని వాల్గోండాలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం వాల్గోండా తండాలో బోదాసు అజయ్ (25)తన తాత భీమయ్య ఇంటి నుండి నీళ్లను తీసుకెళ్ళాడు అనే కారణంతో మొదలైన చిన్నపాటి గొడవ ఘర్షణకి దారితీసింది. ఘర్షణలో అజయ్ మేన అత్తమ్మ ద్యావల్ల లక్ష్మీ ఆమె భర్త పెద్దగంగారాం(45) అజయ్ ను మందలించినందుకు కోపోద్రిక్తుడైన అజయ్ పెద్దగంగారం ను కత్తితో పొడిచాడు. తీవ్రమైన గాయమైన పెద్దగంగారం ను హుటాహుటిన మెట్ పెల్లి లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.