కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు
కోడుమూరు మేజర్ న్యూస్ :
కోడుమూరు పట్టణంలో వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రజలు నివాళులర్పించి,టెంకాయలు కొడుతూ పూజలు నిర్వహించారు. వాల్మీకి జీవిత విశేషాలను, సమాజానికి అందించిన సందేశాలను స్మరించుకున్నారు.ఆయన జీవన శైలీ,రామాయణ మహాకావ్యాన్ని రచించి ప్రపంచానికి ధర్మం, సత్యం, న్యాయం, మానవతా విలువలను చాటిచెప్పిన వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన బోధనలు నేటి సమాజానికి కూడా ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, ఆయన చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని ఆకాంక్షించారు. ఈ జయంతి వేడుకల్లో కోట్ల హరి చక్రపాణి రెడ్డి, రఘునాథ రెడ్డి,కోట్ల హరితరుణ్ రెడ్డి,రమేష్ నాయుడు,ప్రవీణ్ కుమార్,కోడుమూరు టీడీపీ నాయకులు మాజీ సర్పంచ్ సిబీ లత, కె ఈ రాంబాబు, హేమాద్రిరెడ్డి, మధుసూదన్ రెడ్డి,వాల్మీకి నాయకులు బలరాం, ఎల్లప్ప నాయుడు,హనుమంతు,బోసు, సూరి,ధర్మం పూరి అయ్యప్పస్వామి ఆలయ కమిటీ సభ్యులు నల్లబోతుల భాస్కర్ రెడ్డి, జీతూరి రవి, న్యాయవాది ప్రభాకర్, శ్రీలక్ష్మి వెంకటేశ్వర దేవస్థానం కమిటీ అధ్యక్షులు ఎద్దుల మహేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వాల్మీకి జయంతిలో పాల్గొన్న ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి :
కోడుమూరులోని పెద్దబోయి గేరిలో జరిగిన వాల్మీకి జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి పాల్గొన్నారు. వాల్మీకి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. వాల్మీకి మహర్షి సూచించిన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ రామకృష్ణారెడ్డి, పట్టణ అధ్యక్షులు గంగాధర్ నాయుడు, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ ఎల్లప్ప నాయుడు, చేనేత భాస్కర్, బలరాం తదితరులు పాల్గొన్నారు.