BREAKING
ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ! నవంబరు 12న థియేటర్లలోకి రానున్న మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ' రాత్రి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలిపి తింటే ఎన్ని లాభలో తెలుసా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! దీపావళికి ముందే బంగారం బాంబు: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? 20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మామపై కత్తితో అల్లుడి దాడి 5వ వార్డులో జనసేన అభ్యర్థిని మల్లికను ఆశీర్వదించండి : ప్రజలకు గంగారపు రాందాస్ చౌదరి,జనసేన నాయకుల విజ్ఞప్తి కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం - స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం

Select Suryaa Now
రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం

 

రామసముద్రం,మేజర్ న్యూస్ : మండల కేంద్రంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మహర్షి విగ్రహానికి అభిషేకం నిర్వహించి,ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో నివాళులర్పించారు.జయంతిని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ,రామాయణ మహాకావ్యాన్ని రచించి,మానవాళికి ధర్మం,సత్యం,నీతి,న్యాయం వంటి ఉన్నత విలువలను చాటిచెప్పిన ఆదికవి వాల్మీకి మహర్షి అని కొనియాడారు.ఆయన రచనలు తరతరాలకు నైతిక విలువలను బోధిస్తూ,ఆదర్శవంతమైన జీవనానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.వాల్మీకి మహర్షి బోధించిన ధర్మమార్గం,సత్యనిష్ఠ,మానవతా విలువలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు.మహర్షి ఆశయాలను భావితరాలకు అందించడం ద్వారా సమాజంలో నైతిక విలువలను పెంపొందించవచ్చని అభిప్రాయపడ్డారు.జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు,అన్నదానంలో భక్తులు పాల్గొన్నారు.భక్తి,ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగిన ఈ వేడుకలతో రామసముద్రంలో పండుగ వాతావరణం నెలకొంది.

రిపోర్టర్ : హరినాథ్,రామసముద్రం,మదనపల్లి నియోజకవర్గం