లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు
ఓర్వకల్లు మేజర్ న్యూస్:
ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె గ్రామంలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కోలాటాలు, చెక్కభజనలతో గ్రామంలో వైభవంగా ఊరేగింపు నిర్వహించారు. భక్తులు, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామంలోని వాల్మీకి సంఘం నాయకులు, పెద్దలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.