BREAKING
ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ! నవంబరు 12న థియేటర్లలోకి రానున్న మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ' రాత్రి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలిపి తింటే ఎన్ని లాభలో తెలుసా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! దీపావళికి ముందే బంగారం బాంబు: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? 20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మామపై కత్తితో అల్లుడి దాడి 5వ వార్డులో జనసేన అభ్యర్థిని మల్లికను ఆశీర్వదించండి : ప్రజలకు గంగారపు రాందాస్ చౌదరి,జనసేన నాయకుల విజ్ఞప్తి కోడుమూరు అభివృద్ధి టిడిపి తోనే సాధ్యం - స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ : రిటర్నింగ్ అధికారి డాక్టర్ మనోహర్ వెల్లడి రామసముద్రంలో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి : ప్రత్యేక పూజలు,భక్తులకు అన్నదానం మీ ఇంటి ఆడబిడ్డ ను ఆదరించి గెలిపించండి.... 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం లొద్దిపల్లెలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు ప్రతి పౌరుడు గర్వపడేలా అభివృద్ధి చేస్తాం -56వ డివిజన్ ప్రచారంలో బ్యాంకు శాంతమ్మ

స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం

Select Suryaa Now
స్థానిక ఎన్నికలలో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం : మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దిశానిర్దేశం - మదనపల్లెలో స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక సమావేశం

 

మదనపల్లి,మేజర్ న్యూస్ : స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మదనపల్లెలో సోమవారం రాష్ట్ర రవాణా,యువజన,క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య నాయకులతో కీలక సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొని ఎన్నికల సన్నద్ధతపై నాయకులతో చర్చించారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు,క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం,ప్రజల్లోకి ప్రభుత్వ సంక్షేమ,అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్లడం,కూటమి అభ్యర్థుల విజయానికి సమన్వయంతో పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు.ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు నాయకులు,కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి దిశానిర్దేశం చేశారు.ఈ సమావేశంలో జోనల్ కోఆర్డినేటర్ దామచర్ల సత్య,మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా,పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి,తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జ్ జి.శంకర్ యాదవ్,అన్నమయ్య జిల్లా టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు,పుంగనూరు టీడీపీ మాజీ ఇన్‌చార్జ్ చల్లా బాబురెడ్డి,జనసేన పార్టీ రాయలసీమ కన్వినర్ రాజంపేట పార్లమెంట్ స్థానిక ఎన్నికల  సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి,జనసేన పార్టీ మదనపల్లి  నియోజకవర్గం సమన్వయకర్త జంగాల శివరాం రాయల్ తదితర నాయకులు పాల్గొన్నారు.

రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి