5వ వార్డులో జనసేన అభ్యర్థిని మల్లికను ఆశీర్వదించండి : ప్రజలకు గంగారపు రాందాస్ చౌదరి,జనసేన నాయకుల విజ్ఞప్తి
మదనపల్లె,మేజర్ న్యూస్ : జనసేన పార్టీ ఇన్చార్జ్ రాయలసీమ కో-కన్వీనర్,స్థానిక సంస్థల ఎన్నికల రాజంపేట పార్లమెంట్ సమన్వయకర్త గంగారపు రాందాస్ చౌదరి,మదనపల్లి మార్కెట్ చైర్మన్,మదనపల్లి నియోజకవర్గం సమన్వయకర్త జంగాల శివరాం కూటమి నాయకులతో కలిసి ఐదవ వార్డులో మదనపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు,5వ వార్డు కూటమి బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థిని చామంచుల మల్లికా సిద్ధుల గెలుపు కోసం ఇంటింటికి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మదనపల్లి మున్సిపాలిటీ పరిధిలో అభివృద్ధి జరగాలంటే కేవలం కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే కౌన్సిల్ కు మాత్రమే సాధ్యమన్నారు.కావున వార్డు ప్రజలు వాస్తవికంగా ఆలోచించి కూటమి చైర్మన్ అభ్యర్థి అయిన శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను,5వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిని చామంచుల మల్లికను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన,టీడీపీ,బీజేపీ నాయకులతోపాటు ఆయా పార్టీల కార్యకర్తలు,వీరమహిళలు,జనసైనికులు,ప్రజలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : కె.ఈశ్వర్ రెడ్డి,మదనపల్లి నియోజకవర్గం ఇంచార్జి