BREAKING
ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తం ఎన్నికల నిర్వహణలో పీఓలదే కీలక పాత్ర ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 16వ డివిజన్ అభ్యర్థి బండి రాజేశ్వరి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా ప్రచారం చెన్నై సూపర్ కింగ్స్‌లో భారీ మార్పులు: 19 ఏళ్ల అనుబంధానికి గుడ్‌బై చెప్పిన మైక్ హస్సీ, కొత్త కోచ్ ఎవరంటే? అర్నాబ్ తుఫాన్ ఎఫెక్ట్.. 53 రైళ్లు రద్దు! టీమిండియాకు అరుదైన వజ్రం దొరికాడు.. యువ ఆటగాళ్లపై అజింక్య రహానే ప్రశంసల జల్లు! వెబ్ సిరీస్ వద్దన్నారు.. ఓటీటీపై జాతీయ అవార్డు నటి కీర్తి సురేష్ సంచలన వ్యాఖ్యలు! సంగీతానికి భాషతో సంబంధం లేదు: కచేరీలలో తమిళ పాటలపై వస్తున్న విమర్శలపై ఏఆర్ రెహమాన్ ఆసక్తికర వ్యాఖ్యలు ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ! నవంబరు 12న థియేటర్లలోకి రానున్న మిస్టిరీయస్‌ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'అ' రాత్రి పడుకునే ముందు పాలలో ఖర్జూరం కలిపి తింటే ఎన్ని లాభలో తెలుసా.. ఆరోగ్య నిపుణుల కీలక సూచనలు! దీపావళికి ముందే బంగారం బాంబు: భారీగా పెరిగిన పసిడి, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంతంటే? 20,21 వార్డు వైకాపా కౌన్సిలర్ అభ్యర్థులు షేక్ షబానా,ఎస్.ఏ కరీముల్లా గెలుపే లక్ష్యం : జననీరాజనాల మధ్య సాగిన వైఎస్ఆర్సిపి ప్రచారం - హాజరైన పార్టీ అతిరథ మహారధులు కోడుమూరులో ఘనంగా వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు మామపై కత్తితో అల్లుడి దాడి

ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ!

Select Suryaa Now
ఒంటరిగా ఉన్న షావుకారు జానకి కుమార్తెకు తప్పిన పెను ప్రమాదం.. బాత్రూమ్‌లో జారిపడి అగ్నిమాపక సిబ్బంది ద్వారా రెస్క్యూ!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: దివంగత ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కుటుంబంలో తీవ్ర ఆందోళనకర ఘటన చోటుచేసుకుంది. షావుకారు జానకి పెద్ద కుమార్తె యజ్ఞప్రభ చెన్నైలోని తన నివాసంలో ప్రమాదవశాత్తు జారిపడి లేవలేని నిస్సహాయ స్థితిలో చిక్కుకుపోయారు. ఈ వార్త ప్రస్తుతం సినీ వర్గాలలో మరియు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనారోగ్య సమస్యల కారణంగా ఒంటరిగా జీవిస్తున్న ఆమె ఆపదలో చిక్కుకున్న వైనం అందరినీ కలచివేస్తోంది.

వివరాల ప్రకారం, దివంగత నటి షావుకారు జానకి రెండు నెలల క్రితం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమె పెద్ద కుమార్తె అయిన 76 ఏళ్ల యజ్ఞప్రభ చెన్నైలోని దురైపాక్కం ప్రాంతంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసిస్తున్నారు. ఇటీవలే ఆమె కాలికి శస్త్రచికిత్స జరగడంతో నడవలేని స్థితిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె పిల్లలు అమెరికాలో స్థిరపడటంతో యజ్ఞప్రభ ఒక్కరే ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ గడుపుతున్నారు. సోమవారం ఉదయం సమయంలో బాత్రూమ్‌కు వెళ్లొస్తుండగా ప్రమాదవశాత్తు వీల్‌చైర్ నుంచి కిందపడిపోయారు.

కిందపడిన తర్వాత ఆమె స్వయంగా లేవలేకపోవడంతో పాటు తీవ్ర నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఇంటి తలుపులు లోపల నుంచి గెంటబడి ఉండడం, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆమె చేసిన సహాయార్ధ శబ్దాలు బయటకు వినిపించలేదు. అయితే అతికష్టం మీద తన సమీపంలో ఉన్న సెల్‌ఫోన్‌ను అందుకొని బంధువులకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించారు. వెంటనే అప్రమత్తమైన బంధువులు పోలీసులకు మరియు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అత్యంత చాకచక్యంగా ఇంటి ప్రధాన తలుపులను పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. వీల్‌చైర్ నుంచి కిందపడిపోయి నడవలేని స్థితిలో ఉన్న యజ్ఞప్రభను సురక్షితంగా బయటకు తీసి తక్షణ సహాయం అందించారు. సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పిందని, ప్రస్తుతం ఆమె సురక్షితంగా ఉన్నారని తెలుస్తోంది. ఒంటరిగా ఉంటున్న వృద్ధులకు ఈ సంఘటన ఒక పెద్ద హెచ్చరికలా నిలుస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.