BREAKING
టాటా సన్స్ బోర్డులో కలకలం.. చంద్రశేఖరన్ నియామకంపై నోయల్ టాటా లేఖ యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం: డిసెంబర్ నుంచి అమెరికాకు లార్డ్స్ మార్క్ ఎగుమతులు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం 60,000 మందికి బైఅవుట్ ఆఫర్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ టెక్ రంగంలో తీవ్ర కలకలం! పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్ గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరసింహ గౌడ్ పోలీస్ అమరవీరులను స్మరించుకుంటూ కొవ్వొత్తుల ర్యాలీ రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి -- రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో సహకరించాలి -- నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను -- ప్రజావాణికి 11 ఫిర్యాదులు జిల్లేడు ద్రావణంతో పంటలకు సహజ రక్షణ రమేష్ కుటుంబానికి శంబంగి పరామర్శ ఆర్నబ్ తుఫాన్‌పై అప్రమత్తం ఎన్నికల నిర్వహణలో పీఓలదే కీలక పాత్ర ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 16వ డివిజన్ అభ్యర్థి బండి రాజేశ్వరి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా ప్రచారం

ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.. 16వ డివిజన్ అభ్యర్థి బండి రాజేశ్వరి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా ప్రచారం

Select Suryaa Now
ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్..  16వ డివిజన్ అభ్యర్థి బండి రాజేశ్వరి, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతుగా ప్రచారం

అనంతపురం మేజర్ న్యూస్ ప్రతినిధి :- అనంతపురం నగరంలోని 16వ డివిజన్ ఉమానగర్‌లో కూటమి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉమానగర్‌లోని ఎల్లమ్మ తల్లి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముందుగా ఎల్లమ్మ తల్లి ఆలయంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను కలుసుకున్నారు.ఈ సందర్భంగా కూటమి తరఫున 16వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి రాజేశ్వరితో పాటు మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ అమూల్యమైన ఓటును వినియోగించి అభ్యర్థులను గెలిపించడం ద్వారా అనంతపురం నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. కూటమి అభ్యర్థులకు మద్దతుగా నాయకులు, కార్యకర్తలు ప్రచారంలో పాల్గొని ప్రజలను కలుసుకున్నారు. ఉమానగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంతో 16వ డివిజన్‌లో ఎన్నికల ప్రచార సందడి నెలకొంది.

 మల్లికార్జున నేటి దినపత్రిక సూర్య స్టాఫ్ రిపోర్టర్..