BREAKING
క్లాడ్ ఏఐ సృష్టికర్త ఆంత్రోపిక్ ఐపీవో.. అండగా గూగుల్, అమెజాన్ ఒలేష్కీ ప్రాంతంలో మానవతా సహాయం కోసం రష్యా-ఉక్రేనియా స్థానిక కాల్పుల విరమణ కళ్యాణదుర్గంలో తెలుగుదేశం పార్టీ ప్రచారం హోరు. 5 నిమిషాల్లో బ్యాటరీ మార్పిడి: బ్లూ ఎనర్జీ మోటార్స్ బిగ్ స్టెప్ పట్టభద్రులారా.. మీ భవిష్యత్తు కోసం ఓటు నమోదు చేసుకోండి: మాజీ బీసీ కమిషన్ సభ్యులు ఎన్. శుభ ప్రద్ పటేల్ ఆదాయంలో రికార్డులు.. వర్క్‌ఫోర్స్‌లో కోతలు: మైక్రోసాఫ్ట్ వ్యూహం వికారాబాద్‌లో నేడు ‘ఓటు బచావో – దేశ్ బచావో’ కార్యక్రమం:డిసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బబుల్ ఇప్పటికే బద్దలైంది క్యూ2లో పేటీఎం లాభాల జోరు.. యూపీఐ ఎండీఆర్‌పై కీలక గైడెన్స్ టాటా సన్స్ బోర్డులో కలకలం.. చంద్రశేఖరన్ నియామకంపై నోయల్ టాటా లేఖ యూఎస్ ఎఫ్‌డీఏ ఆమోదం: డిసెంబర్ నుంచి అమెరికాకు లార్డ్స్ మార్క్ ఎగుమతులు మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం 60,000 మందికి బైఅవుట్ ఆఫర్: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం.. గ్లోబల్ టెక్ రంగంలో తీవ్ర కలకలం! పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్

ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి -- రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో సహకరించాలి -- నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను -- ప్రజావాణికి 11 ఫిర్యాదులు

Select Suryaa Now
ఓటర్ల జాబితాలో తప్పులను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలి -- రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో సహకరించాలి -- నారాయణపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీను --  ప్రజావాణికి 11 ఫిర్యాదులు

*నారాయణపేట, సూర్యన్యూస్* : నారాయణపేట జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) హాల్‌లో సోమవారం అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీను రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాకు సంబంధించిన వివిధ అంశాలు, నోటీసుల విచారణ, పరిష్కార ప్రక్రియ, ఓటర్ల వివరాల్లో ఉన్న తప్పుల సవరణ, ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ శ్రీను మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో నమోదైన వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి, తప్పులు లేకుండా చూడాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఓటర్ల జాబితాలో ఫోటోలు తప్పుగా నమోదైన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు. సంబంధిత సమస్యలను గుర్తించి, నిబంధనల ప్రకారం వాటిని పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించి జారీ చేసిన నోటీసుల విచారణ, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన విధానాలను సమావేశంలో వివరించారు. నోటీసులకు సంబంధించిన అంశాలను నిబంధనల ప్రకారం పరిశీలించి, నిర్ణీత ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులకు ఏవైనా సందేహాలు లేదా అభ్యంతరాలు ఉంటే వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఓటర్ల జాబితాలో కొంతమంది ఓటర్ల ఫోటోలు తప్పుగా నమోదైన అంశంపై సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. ఓటర్ల వివరాలు సక్రమంగా ఉండటం, అర్హులైన ప్రతి ఓటరుకు సంబంధించిన సమాచారం తప్పులు లేకుండా నమోదవడం ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఫోటోలు, ఇతర వివరాలకు సంబంధించిన తప్పులను గుర్తించి, నిబంధనల ప్రకారం సరిచేసేందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వంతు సహకారం అందించాలని కోరారు.

*ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై అవగాహన*
ఎమ్మెల్సీ ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకునే విధానం, దరఖాస్తు ప్రక్రియలో అనుసరించాల్సిన పద్ధతులపై కూడా సమావేశంలో చర్చించారు. అర్హులైన వారు నిబంధనలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకునేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఓటరు నమోదు ప్రక్రియకు సంబంధించిన వివరాలను ప్రజలకు తెలియజేయడం ద్వారా అర్హులైన వారు తమ పేర్లను ఓటర్ల జాబితాలో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగానికి రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీను కోరారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన సమస్యలు, సందేహాలు, అభ్యంతరాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువచ్చి, వాటి పరిష్కారానికి సహకరించాలని సూచించారు. ఓటర్ల జాబితా నిర్వహణ, నోటీసుల పరిష్కారం, ఫోటోల సవరణ, ఎమ్మెల్సీ ఓటరు నమోదు వంటి అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో  కలెక్టరేట్ ఎన్నికల విభాగం అధికారిని జయసుధ, బీఆర్ఎస్ నాయకులు కే.సుదర్శన్ రెడ్డి, బీజేపీ నాయకులు కెంచె శ్రీనివాస్, టిడిపి నాయకులు రాఘవ చౌదరి, సీపీఎం నాయకులు వెంకట్రామ్ రెడ్డి, ఎంఐఎం. నాయకులు పాల్గొన్నారు.

*ప్రజావాణికి 11 ఫిర్యాదులు*
ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ శ్రీను అధికారులకు సూచించారు. నారాయణపేట జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 11 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని  వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ ను విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.  కాగా, అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట.