BREAKING
రూపాయి పతనంపై ఆర్‌బీఐ అప్రమత్తత భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం: 256 మంది యూఎస్ సభ్యుల మద్దతు జపాన్ వడ్డీ రేట్ల పెంపుపై బ్యాంక్ ఆఫ్ జపాన్ మాజీ గవర్నర్ తుమ్మిడిహెట్టిపై సానుకూల స్పందన: ఫడ్నవీస్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలగనున్న సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జెన్నిఫర్ షుఫోర్డ్ తైవాన్ విలీన వేడుకల ప్రదర్శనను తీవ్రంగా తిరస్కరించిన తైపీ యూపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం వాషింగ్టన్ గోల్ఫ్ కోర్సు పునరుద్ధరణ ప్రణాళికలపై ట్రంప్ యత్నాలకు బ్రేక్ కోఫోర్జ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బూస్ట్.. టార్గెట్ ప్రైస్ పెంపు 22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం స్టెర్లైట్ టెక్నాలజీస్‌పై నిర్మల్ బంగ్ బుల్లిష్.. రూ.180 టార్గెట్ ప్రైస్ సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడి యత్నం: అడ్డగించిన సంకీర్ణ దళాలు క్యూ2 ఫలితాలతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల జోరు.. తగ్గిన ఎన్‌పీఏలు సింబయోటెక్ ఫార్మాలాబ్‌కు రూ.1540 టార్గెట్ ప్రైస్: ఐసీఐసీఐ డైరెక్ట్

రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్

Select Suryaa Now
రెవెన్యూ సమస్యలకు దళారులను ఆశ్రయించవద్దు-రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రజలు నేరుగా సంప్రదించాలి-తహసిల్దార్ కే. రవికుమార్

మల్హర్‌, మేజర్ న్యూస్, రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు దళారులను ఆశ్రయించవద్దని మల్హర్‌ తహసీల్దార్‌ కే. రవికుమార్‌ సూచించారు. భూ సంబంధిత సమస్యలు, పట్టాదారు పాస్‌ పుస్తకాలు, ఇతర రెవెన్యూ సేవల కోసం నేరుగా అధికారులను సంప్రదించాలని తెలిపారు.ప్రభుత్వ నిబంధనల ప్రకారం రెవెన్యూ సేవలను పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. రెవెన్యూ పనులు చేయిస్తామంటూ ఎవరైనా డబ్బులు డిమాండ్‌ చేస్తే వారి వివరాలతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.ప్రజలు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ రవికుమార్‌ స్పష్టం చేశారు.

రిపోర్టర్; ప్రభాకర్, మలహర్ , జయశంకర్ భూపాలపల్లి జిల్లా