గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నరసింహ గౌడ్
కొడంగల్, మేజర్ న్యూస్: కొడంగల్ నియోజకవర్గంలోని హస్నాబాద్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నరసింహ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికలో నూతన అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నరసింహ గౌడ్ మాట్లాడుతూ..తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కొడంగల్ కాంగ్రెస్ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి, మండల అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలోని నాయకులు, కార్యకర్తలను కలుపుకొని ఐకమత్యంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అంబయ్య గౌడ్ తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొని నరసింహ గౌడ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
రిపోర్టర్: ఆబీద్, కొడంగల్, వికారాబాద్ జిల్లా