మృతుడు శ్రీనివాస్ కుటుంబానికి రూ.1.02 లక్షల బీమా సాయం
షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 27) : షాబాద్‌లోని స్వామి వివేకానంద పొదుపు సంఘం సభ్యుడు లంబడి శ్రీనివాస్ అనారోగ్యంతో మృతి చెందడంతో, ఆయన కుటుంబానికి సంఘం తరఫున రూ.1,02,000 బీమా సాయాన్ని అందజేశారు. సంఘం అధ్యక్షుడు ధర్పల్లి రవీందర్ గౌడ్, కార్యదర్శి గంధం గౌరీతో పాటు పాలకవర్గ సభ్యులు ఈ మొత్తాన్ని మృతుడి కుటుంబ సభ్యులకు అందించారు.ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ.. పొదుపు సంఘం సభ్యుల కుటుంబాలకు ఆపద సమయంలో అండగా నిలవడమే సంఘం లక్ష్యమని తెలిపారు. శ్రీనివాస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆర్థిక ఇబ్బందుల సమయంలో ఈ బీమా సాయం కుటుంబానికి కొంత ఊరటనిస్తుందని పేర్కొన్నారు.