BREAKING
రూపాయి పతనంపై ఆర్‌బీఐ అప్రమత్తత భారతీయ అమెరికన్లకు అరుదైన గౌరవం: 256 మంది యూఎస్ సభ్యుల మద్దతు జపాన్ వడ్డీ రేట్ల పెంపుపై బ్యాంక్ ఆఫ్ జపాన్ మాజీ గవర్నర్ తుమ్మిడిహెట్టిపై సానుకూల స్పందన: ఫడ్నవీస్‌కు రేవంత్ రెడ్డి ధన్యవాదాలు ట్రంప్ యంత్రాంగం నుంచి వైదొలగనున్న సీడీసీ డిప్యూటీ డైరెక్టర్ జెన్నిఫర్ షుఫోర్డ్ తైవాన్ విలీన వేడుకల ప్రదర్శనను తీవ్రంగా తిరస్కరించిన తైపీ యూపీ ఓటర్ల జాబితాలో అక్రమాలు: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం వాషింగ్టన్ గోల్ఫ్ కోర్సు పునరుద్ధరణ ప్రణాళికలపై ట్రంప్ యత్నాలకు బ్రేక్ కోఫోర్జ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బూస్ట్.. టార్గెట్ ప్రైస్ పెంపు 22వ వార్డులో నంబూరి సురేష్ బాబు ఎన్నికల ప్రచారం స్టెర్లైట్ టెక్నాలజీస్‌పై నిర్మల్ బంగ్ బుల్లిష్.. రూ.180 టార్గెట్ ప్రైస్ సౌదీ అరేబియాపై హౌతీల క్షిపణి, డ్రోన్ దాడి యత్నం: అడ్డగించిన సంకీర్ణ దళాలు క్యూ2 ఫలితాలతో ఇండస్‌ఇండ్ బ్యాంక్ షేర్ల జోరు.. తగ్గిన ఎన్‌పీఏలు సింబయోటెక్ ఫార్మాలాబ్‌కు రూ.1540 టార్గెట్ ప్రైస్: ఐసీఐసీఐ డైరెక్ట్

పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

Select Suryaa Now
పత్తి కాయలకు కోతుల బెడద! వందల సంఖ్యలో పొలాల్లోకి కోతులు-పంట నష్టంతో రైతుల ఆందోళన-పంటను కాపాడేందుకు రైతుల అవస్థలు-అధికారులు స్పందించాలని విజ్ఞప్తి

మల్హర్‌ , మేజర్ న్యూస్, భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్లలో పత్తి సాగు చేస్తున్న రైతులకు కోతుల బెడద తీవ్ర ఇబ్బందిగా మారింది. వందల సంఖ్యలో గుంపులుగా పత్తి చేన్ల పైకి వస్తున్న కోతులు పత్తి మొక్కలపై ఉన్న కాయలను తింటూ పంటకు నష్టం కలిగిస్తున్నాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
పత్తి సాగు కోసం ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన రైతులు, కోతుల దాడులతో ఆందోళన చెందుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో కోతుల బెడద పెరగడంతో దిగుబడిపై ప్రభావం పడుతుందేమోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తి సాగు పంటల పైకీ వస్తున్న కోతులను తరిమేందుకు రైతులు సమయం వెచ్చించాల్సి వస్తోందని చెబుతున్నారు.సంబంధిత అధికారులు స్పందించి, కోతుల బెడదను తగ్గించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పత్తి రైతులు కోరుతున్నారు. పంట నష్టాన్ని నివారించేలా చర్యలు చేపట్టి తమకు ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్ ;ప్రభాకర్ ,మలహర్ మండలం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా