BREAKING
బార్ అసోసియేషన్ సభ్యత్వ కార్డు అందుకున్న బొబ్బ నవత రెడ్డి తిరుపతిలో 35 కోట్ల మురుగు రాజకీయం ప్రజల భద్రతే లక్ష్యం.. ‘మీ సురక్ష 2.0’ మళ్లీ ప్రారంభం చార్మినార్‌లో మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమ్ పునఃప్రారంభం సిద్ధిక్ నగర్‌లో పెండింగ్‌ రోడ్డు ప్యాచ్‌ వర్క్‌ పూర్తి చేయాలి… జలమండలి అధికారికి ఆంజనేయులు సాగర్‌ వినతి హఫీజ్‌పేట్‌ డివిజన్‌ పలు కాలనీల్లో పారిశుధ్య పనులపై అధికారులు ప్రత్యేక తనిఖీలు మాదాపూర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు.. అదుపులోకి ముగ్గురు విదేశీ మహిళలు ట్రస్మా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా జితేందర్ తేజ్వాని ఎన్నిక మసీదుబండ 100 అడుగుల రహదారిపై అక్రమ నిర్మాణాలు!జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు ‘ఓట్ బచావో – దేశ్ బచావో’ నిరసనకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి :కూన శ్రీశైలం గౌడ్ పిలుపు.. చింతల్ హెచ్‌ఎంటీ కాలనీ దర్గా ఉర్స్‌ పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ చెరువుల పునరుజ్జీవనానికి ‘అసెజ్ వావో’ కృషి అభినందనీయం :ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ జపాన్ ఆర్థిక వృద్ధిలో సానుకూల మార్పు ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ ప్రచారం.*ఓట్ బచావో – దేశ్ బచావో’ కార్యక్రమంపై ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నర్సారెడ్డి భూపతిరెడ్డి చైనా మార్కెట్లో సిటీగ్రూప్, వీసా ప్రాముఖ్యత

ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం

Select Suryaa Now
ఉద్యోగం పేరుతో మోసం.. మహిళపై అత్యాచారం

ఘట్‌కేసర్, మేజర్ న్యూస్:ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు వసూలు చేయడమే కాకుండా, మహిళపై అత్యాచారానికి పాల్పడిన సంఘటన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం మల్లాపూర్‌లో టైలరింగ్‌ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న 30 ఏళ్ల మహిళకు నాలుగు నెలల క్రితం భువనగిరికి చెందిన జగన్మోహన్‌ ఫోన్‌ ద్వారా పరిచయమయ్యాడు. భువనగిరి మున్సిపల్‌ కార్యాలయంలో ఉద్యోగం ఇప్పిస్తానని, ఇందుకు రూ.5 లక్షలు ఖర్చవుతాయని నమ్మించాడు.
ఈ క్రమంలో అక్టోబరు 26న మల్లాపూర్‌లోని రత్నదీప్‌ సమీపంలో మహిళను తన కారులో ఎక్కించుకున్న జగన్మోహన్‌.. భువనగిరి మున్సిపల్‌ కార్యాలయానికి తీసుకెళ్తానని చెప్పి ఔషాపూర్‌లోని శ్రీనిధి రిసార్ట్‌కు తీసుకెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. మార్గమధ్యంలో రూ.4.5 లక్షలు తీసుకుని కారు డ్యాష్‌బోర్డులో పెట్టుకున్నాడని తెలిపింది. రిసార్ట్‌లోని గదిలోకి తీసుకెళ్లి బలవంతంగా దాడి చేసి, తన ఇష్టానికి వ్యతిరేకంగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. అనంతరం కారులో తీసుకెళ్లి హైవేపై కారు నుంచి తోసేసి వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఘట్కేసర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.