మసీదుబండ 100 అడుగుల రహదారిపై అక్రమ నిర్మాణాలు!జీహెచ్‌ఎంసీ అధికారులకు ప్రజలు ఫిర్యాదు
నిబంధనలు ఉల్లంఘించిన భవనాలపై చర్యలు తీసుకోవాలి…
శేరిలింగంపల్లి, మేజర్ న్యూస్ : సర్వే నంబర్ 169 పరిసరాల్లో జరుగుతున్న భవన నిర్మాణాలపై సంబంధిత అధికారులు తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మసీదుబండ ప్రజలు శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కు పిర్యాదు చేసారు.ఈ సందర్బంగా భవన నిర్మాణ అనుమతులు, రహదారి వెడల్పు, సెల్లార్ పార్కింగ్ తదితర నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనే అంశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ హెచ్‌సీయూ బస్ డిపో నుంచి బొటానికల్ గార్డెన్ వైపు వెళ్లే మార్గంలోని నిర్మాణాల విషయంలో రహదారి విస్తీర్ణం, భవనాల నిర్మాణ అనుమతులు, పార్కింగ్ సదుపాయాలపై సందేహాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొన్ని నిర్మాణాల్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు జరుగుతున్నాయన్న ఆరోపణలపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టాలని కోరారు.జీహెచ్‌ఎంసీ అధికారులు సంబంధిత రికార్డులను పరిశీలించి, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగినట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రహదారి విస్తరణకు ఆటంకం కలగకుండా, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు.అధికారులు స్పందించాలి: ఫిర్యాదులో పేర్కొన్న నిర్మాణాలపై సమగ్ర విచారణ జరిపి, ఉల్లంఘనలు నిర్ధారణ అయితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదుదారులు డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని కోరారు.