జడ్పీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే అమిలినేని
కళ్యాణదుర్గం ఇన్చార్జ్ (కళ్యాణదుర్గంఇన్చార్జ్ మేజర్ న్యూస్) : కళ్యాణదుర్గం నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు బీ-ఫారాలను అందజేశారు. మంగళవారం నియోజకవర్గ పరిధిలోని బ్రహ్మసముద్రం జడ్పీటీసీ అభ్యర్థి శ్రీరాములు, శెట్టూరు అభ్యర్థి ఉరాల రాజేశ్వరి, కుందుర్పి అభ్యర్థి ప్రభావతి, కళ్యాణదుర్గం అభ్యర్థి లక్ష్మికి బీ-ఫారాలను అందించారు.
ఈ సందర్భంగా ఆయా మండలాల్లో పార్టీ అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచి విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. బీ-ఫారాల అందజేతతో నియోజకవర్గంలో జడ్పీటీసీ ఎన్నికల రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి.
రిపోర్టర్ : సుధా మోహన్, కళ్యాణదుర్గం ఇన్చార్జ్, కళ్యాణదుర్గం.