BREAKING
మూడో టీ20లో న్యూజిలాండ్ దూకుడు: 7.4 ఓవర్లలో 86/1 చెమల్లపల్లె ఎంపీటీసీగా చిల్లరగాళ్ల సుభాన్ బీ ఏకగ్రీవం అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఎమ్మెల్యే వెంకట్రావు. 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా ఎమ్మెల్యే సతీమణి అనూష విస్తృత ప్రచారం ఇస్నాపూర్‌లో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన త్రిపురవరం ఎంపీటీసీగా జోగాల్ల ఎల్లయ్య ఏకగ్రీవ ఎన్నిక అర్నబ్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం.. తపాలా జీవిత బీమాపై అవగాహన ర్యాలీ రైతుల సమస్యలపై దృష్టి మళ్లించేందుకే తుమ్మిడిహట్టి ప్రకటనలు : బాల్క సుమన్ తుమ్మిడిహట్టి డీపీఆర్‌ బయటపెట్టాలి వైసిపి పాలనలో గ్రామాల అభివృద్ధిని విస్మరించారు. ఎమ్మెల్యే అమిలినేని. చెప్పాం.. చేశాం.. ధైర్యంగా ఓటు అడుగుతున్నాం దీపావళి సందర్భంగా గ్రీన్ క్రాకర్స్ ను(పర్యావరణహిత బాణసంచా) మాత్రమే విక్రయించాలి, కాల్చాలి* *జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి* కూటమి విజయం ఖాయం.. విపక్షాల ఆశలు అడియాశలే: సీట్ల సర్దుబాటుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ‘జాంబీ రెడ్డి 2’ సినిమాపై తేజ సజ్జ కామెంట్స్ 7వ వార్డులో టీడీపీ అభ్యర్థి రెడ్డమ్మ విస్తృత ప్రచారం

ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

Select Suryaa Now
ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

సంగారెడ్డి: ప్రజాపాలనలో భాగంగా ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమీక్షించేందుకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పురోగతి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాల ఫలాలు, వివిధ శాఖల పనితీరు, పెండింగ్‌లో ఉన్న సమస్యలు తదితర అంశాలపై ఈ సమీక్ష సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశంలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమరయ్య, శాసనసభ్యులు డాక్టర్ సంజీవరెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్ రావు, సునీత లక్ష్మారెడ్డి, ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.అలాగే రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేష్ కుమార్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.ప్రజాపాలన లక్ష్యాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించడం, ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు చేరవేయడం, జిల్లాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడం, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషించడం వంటి అంశాలకు ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇవ్వనున్నారు.మూడు జిల్లాలకు సంబంధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర సమీక్ష నిర్వహించడం ద్వారా ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు, క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టే దిశగా ఈ ఉన్నత స్థాయి సమావేశం కొనసాగుతోంది.