BREAKING
25 ఏళ్ల తర్వాత అట్లూరు జెడ్పీటీసీ స్థానం టీడీపీ కైవసం స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ నేతల సవాల్ ఘనంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు**వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేడుకలకు హాజరైన అభిమానులు**కేక్ కటింగ్‌తో పాటు తలసేమియా చిన్నారుల కోసం రక్తదాన శిబిరం నిర్వహణ* ఆర్నబ్‌ తుఫాను దెబ్బ.. 81,350 హెక్టార్లలో పంట నష్టం డ్రగ్స్ వాడకంతో నష్టాలపై సమన్వయంతో వివరించాలి.. కలెక్టర్, ఎస్పీ నార్కోటిక్ కంట్రోల్ సమావేశం. పాక్‌ గడ్డపై లంక పేసర్ సంచలనం.. 30 ఏళ్ల ఆల్‌టైమ్‌ రికార్డు బద్దలు! తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఆక్లాండ్‌కు చేరిన టీమిండియా.. జట్టును వీడిన కుశాగ్ర! కత్తెర గుర్తుతో కొరివి శ్రీకాంత్ ప్రచారం ప్రారంభం ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం ఎల్‌నినో పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలి విద్యార్థినుల కోసం ‘కూల్ అండ్ హాట్ వాటర్ ఫిల్టర్’ అందజేత నాగారంలో బీజేపీ బూత్ కమిటీ నియామకం చల్లపల్లి-విజయవాడ రోడ్డుపై విరిగిపడిన చెట్లు తొలగింపు కరీంనగర్ టు శబరిమల మహాపాదయాత్ర ప్రారంభం తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అర్నబ్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం..

Select Suryaa Now
అర్నబ్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటాం..

అమరావతి: నిన్నటి వరకు ఎల్‌నినో సవాళ్లను ఎదుర్కొన్నామని, ఇప్పుడు తీవ్ర తుఫాన్‌గా మారిన ‘అర్నబ్’ రాష్ట్రాన్ని ముంచెత్తే ప్రమాదం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తుఫాన్ ప్రభావం మరియు అత్యవసర సహాయక చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు.

ఈ తుఫాన్ రేపు (అక్టోబర్ 28) మధ్యాహ్నం నాటికి తీరం దాటే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే కోస్తాంధ్రలోని పలు జిల్లాల్లో ఉదయం నుంచే వర్షాలు ప్రారంభమయ్యాయని, ఇవాళ, రేపు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం దాటే సమయంలో గంటకు 135 కిలోమీటర్ల వరకు ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున అధికారులు కంటిమీద కునుకు లేకుండా పనిచేయాలని ఆదేశించారు.

ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత వరకు తగ్గించడమే లక్ష్యంగా సెక్రటేరియట్‌లోని రియల్ టైమ్ గవర్నెన్స్ (RTGS) కంట్రోల్ రూమ్ ద్వారా పరిస్థితిని నిరంతరం మానిటరింగ్ చేస్తున్నామని సీఎం చెప్పారు. వర్షాలు, ఈదురుగాలులపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి గంటకోసారి వెదర్ బులిటెన్ విడుదల చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం అన్ని ముందస్తు చర్యలు చేపట్టిందని, అర్నబ్ తుఫాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటామని ప్రజలు అధైర్యపడకూడదని చంద్రబాబు కోరారు.