తుఫాన్ బాధితులకు అండగా ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్
నాగాయలంక, మేజర్ న్యూస్: నాగాయలంక మండలం భావదేవరపల్లి గ్రామంలోని ఆర్నబ్ తుఫాన్ బాధితుల పునరావాస కేంద్రాన్ని బుధవారం అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ పరిశీలించారు. శిబిరంలో ఉన్న బాధితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. వారికి మధ్యాహ్న భోజనం వడ్డించారు. తుఫాన్ ముప్పు తగ్గినప్పటికీ వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో అధికారులు సూచనలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని కోరారు. ఆర్నబ్ తుఫాన్ సహాయక చర్యలను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని బాధితులకు అండగా నిలుస్తోందని తెలిపారు. పునరావాస కేంద్రంలో బాధితులకు సురక్షితమైన తాగునీరు అందించాలని, పారిశుధ్య చర్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మండలి ఉదయభాస్కర్ పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, అవనిగడ్డ నియోజకవర్గం, కృష్ణాజిల్లా.