BREAKING
14 వ వార్డు లో దూసుకుపోతున్న కాకి గంగరాజు * మద్దతుగా వెలగపూడి ప్రతాపరుద్ర * నాటుసారా, అక్రమ మద్యం రవాణా నియంత్రణకు ఆంధ్రప్రదేశ్–ఒడిశా అధికారుల సమన్వయ సమావేశం అమెరికన్ బౌద్ధ భిక్షువుకు అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త పురస్కారం ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బండి దీప్తిని భారీ మెజార్టీతో గెలిపించండి ఏయూ పరిశోధకురాలికి కేంద్ర సంగీత నాటక అకాడమీ ‘ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం’ ఏపీ ఉన్నత విద్యా ఫీజుల నియంత్రణ కమిటీ సభ్య కార్యదర్శిగా డా. ఎస్. కృష్ణయ్య నియామకం.. మూడేళ్ల పాటు డిప్యుటేషన్‌పై బాధ్యతలు అక్కంపల్లి వైసిపి, సిపిఐ ఎంపీటీసీ అభ్యర్థి గౌని శారద గెలుపు కోసం విస్తృత ప్రచారం ఏపీ నిట్ డైరెక్టర్‌గా ప్రొఫెసర్ కె.వి. కృష్ణారావు భాద్యతలు స్వీకరణ పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..! ఆర్నబ్ తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారి* రైతులకు శాస్త్రవేత్తల సూచనలు...!! అల్బేనియాలో ఉద్రిక్తతలు.. పార్లమెంట్‌లో ప్రతిపక్ష సభ్యుల తీవ్ర నిరసన మరియు గందరగోళం! తగ్గిన నష్టాలు.. మెరుగైన ఫలితాలు నమోదు చేసిన రెస్టారెంట్ బ్రాండ్స్ ఆసియా! గ్రామపంచాయతీ లలో క్లోరినేషన్ చేసి మంచినీటి సరఫరా చెయ్యాలి.... * డిప్యూటీ ఎంపీడీవో కేకే వర్మ* మూడో త్రైమాసికంలో ఊపందుకున్న అమెరికా ఆర్థిక వృద్ధి..!

కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి.

Select Suryaa Now
కరీంనగర్ జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలి.

 సూర్య కరీంనగర్ ;; కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతుందని ప్రభుత్వం తక్షణమే జిల్లా మొత్తం కరువు జిల్లాగా ప్రకటించాలనించి సిపిఐ డిమాండ్ చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా పూర్తిగా హాస్యాస్పదంగా, అశాస్త్రీయంగా ఉందని, జిల్లాలో కేవలం కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, మరియు హుజూరాబాద్ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని, ఏ ప్రాతిపాదికన ఆ మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.అసలు వ్యవసాయ సాగు భూములే లేని,పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిన కరీంనగర్ అర్బన్ (సిటీ) పరిధిని కరువు ప్రాంతంగా చూపించడం,ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షాల్లేక పంటలు నిలువునా ఎండిపోతున్న గ్రామీణ మండలాలను పక్కన పెట్టడం రైతాంగాన్ని ఘోరంగా వంచించడమేనని,ఆయా మండలాల్లో ఎండుతున్న పంటలు అధికారులకు కనబడడం లేదా అని శ్రీనివాస్ ప్రశ్నించారు.జిల్లాలోని మానకొండూరు,తిమ్మాపూర్, గంగాధర,రామడుగు, చొప్పదండి,చిగురుమామిడి,సైదాపూర్,శంకరపట్నం, ఇల్లందకుంట వంటి మండలాల్లో వరి,పత్తి పంటలకు సాగునీరు అందక,ప్రభుత్వం  విద్యుత్  సకాలంలో ఇవ్వక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని,రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని,ఇవన్నీ అధికారులకు కనిపించడం లేదా? అధికారుల తప్పుడు నివేదికల వల్ల జిల్లాలోని మెజారిటీ రైతులు ప్రభుత్వ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ),పంట రుణాల మాఫీ/రీషెడ్యూల్,ఇన్సూరెన్స్ వంటి లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.కేవలం కరీంనగర్ రూరల్, అర్బన్, హుజూరాబాద్‌ మండలాలకు  మాత్రమే పరిమితం చేసిన అశాస్త్రీయ జీవోను,కరువు జాబితాను సవరించాలని,  పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే క్షేత్ర స్థాయిలో పరిశీలనకు వెళ్లకుండా,ఏసీ రూముల్లో కూర్చుని ఉపగ్రహ చిత్రాలు,తప్పుడు తేమ లెక్కల ఆధారంగా నివేదికలు తయారు చేశారని దీనిని బట్టే అధికారుల పనితీరు ఎలా ఉందో  స్పష్టమవుతోందన్నారు.జిల్లా వ్యాప్తంగా రీ-సర్వే చేసి తక్షణమే ప్రత్యేక అధికారుల బృందాలతో క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పారదర్శకంగా నివేదిక తయారు చెయ్యాలని,పంటలు ఎండిపోయిన ప్రతీ మండలాన్ని కరువు జాబితాలో చేర్చుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని,
ఎల్‌నినో వర్షాభావంతో దెబ్బతిన్న ప్రతి ఎకరాకు 25 వేల రూపాయల తక్షణ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ) అందించి రైతులను ఆదుకోవాలని,జిల్లా వ్యాప్తంగా కరువు పీడిత రైతులందరి పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలనీ, బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు రైతుల నుండి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, కరీంనగర్ జిల్లాలోని అన్ని  మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.