పంట నష్టాలకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం..!
ఆనందపురం, సూర్య : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంట నష్టాలకు పరిహారం ప్రకటించినట్లు సమాచారం. పంటల వారీగా పరిహారం వివరాలు ఇలా ఉన్నాయి. పత్తి, గోధుమ పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించనున్నారు. వరి పంటకు ఎకరాకు రూ.20 వేల సాయం ప్రకటించారు. చెరకు పంటకు ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వనున్నారు. సజ్జ, మినుము, పెసర, మొక్కజొన్న, రాగి, శనగ, సోయాబీన్, పొద్దుతిరుగుడు పంటలకు ఎకరాకు రూ.15 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు పేర్కొన్నారు. అరటి, పసుపు, మామిడి, జీడిమామిడి, కాఫీ, డ్రాగన్ ఫ్రూట్ పంటలకు ఎకరాకు రూ.35 వేల పరిహారం ప్రకటించారు. కూరగాయలు, బొప్పాయి, టమాట, పైనాపిల్ పంటలకు ఎకరాకు రూ.25 వేల సాయం అందించనున్నారు. తమలపాకు తోటలకు ఎకరాకు రూ.75 వేల పరిహారం ఇవ్వనున్నట్లు తెలిపారు. కొబ్బరి, ఆయిల్‌పామ్ పంటలకు ఒక్కో చెట్టుకు రూ.15 వేల చొప్పున పరిహారం ప్రకటించినట్లు సమాచారం.