అంబటి అంజయ్య కు ఎమ్మెల్యే వేముల నివాళి*
*సూర్య ,శాలిగౌరారం*
మండల పరిధిలోని ఇటుకులపహాడ్ గ్రామానికి చెందిన అంబటి అంజయ్య బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి మరణించారు.
ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అంజయ్య పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించి,మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎస్.కె జహంగీర్,నకిరేకల్ పట్టణ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైటప్ :
అంజయ్య మృతదేహానికి నివాళులర్పిస్తున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం..