ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారం..
అనంతపురం కలెక్టరేట్ :ఆదర్శనగర్‌లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ విస్తృత ప్రచారం..
37వ డివిజన్‌లో కూటమి అభ్యర్థుల తరఫున ఇంటింటా ప్రచారం. నగరంలోని ఆదర్శనగర్ 37వ డివిజన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాల్గొని, కూటమి తరఫున టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి దాసరి చంద్రకళ, బీజేపీ మేయర్ అభ్యర్థి అజేష్ బాబు తరఫున ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా స్థానిక ప్ర ఆప్యాయంగా కలుసుకుని, కూటమి అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. నగర అభివృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు.37వ డివిజన్ అభివృద్ధితో పాటు అనంతపురం నగర ప్రగతికి స్థానిక సంస్థల ఎన్నికలు కీలకమని ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి దాసరి చంద్రకళ, మేయర్ అభ్యర్థి అజేష్ బాబుకు ప్రజలు తమ మద్దతు తెలియజేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అనంతపురం కలెక్టరేట్ రిపోర్టర్.. వేణుగోపాల్.