BREAKING
వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత

గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్

Select Suryaa Now
గంజాయ్ అక్రమణ రవణాలో యువకుడు అరెస్ట్

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంగంజాయి అక్రమ రవాణాపై అనపర్తి పోలీసులు చర్యలు చేపట్టి ఓ యువకుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.2 లక్షల విలువైన నాలుగు కిలోల గంజాయితో పాటు, వివిధ ప్రాంతాల్లో దొంగిలించినట్లు గుర్తించిన తొమ్మిది మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణా కేసు దర్యాప్తులో మోటార్ సైకిళ్ల దొంగతనాల వ్యవహారం కూడా వెలుగులోకి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పోలీసుల వివరాల ప్రకారం ఈ నెల 28వ తేదీ సాయంత్రం సుమారు 5.30 గంటల సమయంలో అనపర్తి గ్రామంలోని ఐఎల్‌టీడీ జంక్షన్ సమీప కాలువ రోడ్డు మీదుగా గంజాయి అక్రమంగా రవాణా అవుతున్నట్లు పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో అనపర్తి పోలీస్ స్టేషన్ సబ్‌ ఇన్‌స్పెక్టర్ వి. సుజాత తన సిబ్బందితో కలిసి మధ్యవర్తుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనపర్తి గ్రామంలోని జీబీఆర్ కళాశాల ఎదురుగా నివసించే కొల్లాటి శ్రీ తేజ అలియాస్ డైపర్ (19) మోటార్ సైకిల్‌పై బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.2 లక్షలుగా అంచనా వేశారు. గంజాయి కేసులో నిందితుడిని విచారించగా, వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తొమ్మిది మోటార్ సైకిళ్లను దొంగిలించినట్లు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. అతను అందించిన వివరాల ఆధారంగా ఆ మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో గంజాయి అక్రమ రవాణాతో పాటు పలు ప్రాంతాల్లో జరిగిన వాహనాల దొంగతనాల వ్యవహారంపైనా పోలీసులు దృష్టి సారించారు. ఈ ఘటనపై అనపర్తి పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టారు. స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్లకు సంబంధించిన దొంగతనాల వివరాలు, ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.