BREAKING
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక

జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి    జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి కొమరం భీమ్  జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరు ఒక లక్ష్యంతో ముందుడుగు సాగాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లాలోని కెరమెరి మండలం దేవాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని కొలాంగూడ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమగ్ర ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగేంద్రతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ క్షయ వ్యాధిని జిల్లా నుండి నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు. క్షయ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తించి అవసరమైన మందులు, పోషక ఆహారం 6 నెలల పాటు క్రమ తప్పకుండా తీసుకుంటే వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. క్షయ వ్యాధిని నిర్మూలించడంలో ప్రారంభ దశలోనే గుర్తించక పోతే ఇతరులకు వ్యాపిస్తుందని తెలిపారు. క్షయ వ్యాధి లక్షణాలు కలిగిన వ్యక్తులు నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి జన్ మన్ పథకం క్రింద చాల మంచి ఇండ్లు రాలేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ అర్హులైన అందరికీ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం నిర్ణీత విస్తీర్ణంలో నాణ్యత ప్రమాణాలతో ఇండ్లు నిర్మించుకోవాలని తెలిపారు. గ్రామములో టి డబ్ల్యూ పి ఎస్ పాఠశాలను సందర్శించి విద్యార్థుల హాజరు వివరాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకుని చిన్నారులకు చాక్లెట్లు అందించారు.అంతకుముందు క్షయ వ్యాధి నిర్మూలన వాహనాలను జండా ఊపి ప్రారంభించారు. అందరూ సమన్వయంతో కృషి చేసి క్షయ రహిత గిరిజన గ్రామాలుగా తీర్చిదిద్దాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారి వినయ్‌కుమార్, కొలంగూడ సర్పంచ్ కుమ్రంభీం రావు, ఉప సర్పంచ్ బారిక్ రావు, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.