ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా
రొంపిచెర్ల-మేజర్ న్యూస్:-ఒక అవకాశం ఇవ్వాలని తానేమిటో అభివృద్ధి చేసి చూపిస్తానని రొంపిచర్ల వైఎస్సార్ సీపీ జడ్పిటిసి అభ్యర్థి కోటా సుష్మ అన్నారు. గ్రామపంచాయతీలో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలను ఘోరంగా మోసం చేసింది అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదన్నారు. ఆడబిడ్డ అనేది నిరుద్యోగ భృతి వంటివి అసలే చేయలేదన్నారు. తాను ఉద్యోగం వదిలి రాజకీయాలకు వచ్చానని తన అందరూ ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు చిచ్చిలి పురుషోత్తం రెడ్డి,చిచ్చిలి రెడ్డిశ్వర్ రెడ్డి, కోట వెంకటరమణ, కృష్ణ మహేష్, గోపీనాథ్ రెడ్డి, కుమార్ నాయుడు, సురేందర్ నాయుడు, రామకృష్ణ నాయుడు, శ్రీనాథ్ నాయుడు , బాబు,విజయ శేఖర్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు.