BREAKING
కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక గెలుపు లక్ష్యంగా గాలి కావ్య ప్రచారం -కొర్లగుంటలో బ్రహ్మరథం పట్టిన మహిళలు ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న ఎమ్మెల్యే. దేశవాళీ మహిళల టీ20 చరిత్రలో సరికొత్త ప్రపంచ రికార్డు.. హైదరాబాద్‌పై భారీ స్కోరు సాధించిన ఢిల్లీ కట్టంగూర్ పూలస్వామికి ప్లాటినం ఐకాన్ అవార్డు న్యూఢిల్లీలో ఘనంగా సత్కారం 31వ డివిజన్ ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి... ప్రచారంలో మందపాటి భానుప్రియ నర్రావుల వివాహ వేడుకల్లో పాల్గొన్న తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి కష్టపడి పని చేస్తా అవకాశం కల్పించండి -బ్యాంకు శాంతమ్మ విస్తృత ప్రచారం భారత్‌తో టీ20 సిరీస్‌కు కివీస్ స్టార్ పేసర్ లాకీ ఫెర్గూసన్ దూరం ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా లక్ష్యం. 6 నెలల లోపే సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా... 39 వ డివిజన్ జనసేన కార్పొరేటర్ అభ్యర్థి పింకీ జైన్ సినిమా బాగలేకపోతే ప్రేక్షకులు నేరుగా మొహం మీదే చెబుతారు: విక్టరీ వెంకటేశ్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు కాచి చల్లార్చిన నీటిని తాగాలి వరి పంటలో నీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలి

క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన

Select Suryaa Now
క్రీడాకారులకు శాప్ చైర్మన్ అభినందన

 

తిరుపతి ఎడ్యుకేషన్ మేజర్ న్యూస్

చైనాలోని జింగ్‌షాన్‌లో ఈనెల 31 వరకు జరగనున్న 5వ ప్రపంచ జూనియర్ సాఫ్ట్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌–2026లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ.ఎస్. వైశాలి, తమిళనాడుకు చెందిన తనికా తాయుమానవన్‌లు జపాన్ పై అద్భుతమైన ప్రదర్శన కనబరిచి బాలికల డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు గురువారం అద్భుత ప్రతిభతో కాంస్య పథకం సాధించిన క్రీడాకారులను శాప్ చైర్మన్ రవి నాయుడు అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ వేదికపై తమ ప్రతిభను చాటుతూ భారతదేశానికి కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన వైశాలి, తనికాల విజయం అభినందనీయమని పేర్కొన్నారు. క్రీడాకారిణులు ప్రదర్శించిన కృషి, పట్టుదల, అంకితభావం దేశంలోని యువ క్రీడాకారులకు, ముఖ్యంగా యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. భవిష్యత్తులోనూ మరిన్ని విజయాలు సాధిస్తూ అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి దేశానికి

పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు 

క్రీడారంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించి మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షిస్తూ రవి నాయుడు వైశాలికి శుభాకాంక్షలు తెలియజేశారు.