BREAKING
బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్ ఓటేరులో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరిక

వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల

Select Suryaa Now
వరుణ్ సందేశ్ యద్భావం తద్భవతి చిత్రం నుండి జిజెన్ చిక సాంగ్ విడుదల

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో వరుణ్ సందేశ్ నటిస్తున్న తాజా చిత్రం యద్భావం తద్భవతి. రమేష్ జక్కల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ప్రసన్న భూమి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఇనయ సుల్తానా, రేణు శ్రీ హీరోయిన్లుగా నటిస్తుండగా సుమన్, నాగ మహేష్, లోహిత్ కుమార్, ధనరాజ్, శ్వేత వర్మ, దయానంద్ రెడ్డి, శ్రీకాంత్ అయ్యంగర్ తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. శ్యామ్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి మిహిరామ్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమాకు సంబంధించిన పాటలను కే మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నారు.

చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి జిజెన్ చిక అంటూ సాగే మాస్ పెప్పి సాంగ్ ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ ఈ పాటను తన చేతుల మీదుగా విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. బట్టు విజయ్ కుమార్ ఈ పాటను ఎనర్జిటిక్ గా సాహిత్యం అందించగా, టాలీవుడ్ ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తనదైన శైలిలో ఆలపించారు. ఈ పాటకి జేడీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. పాట విజువల్స్ మరియు డ్యాన్స్ మూవ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేలా ఉన్నాయని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.

ఈ పాట విడుదల అనంతరం ప్రముఖ సింగర్ ఎం.ఎం. శ్రీలేఖ మాట్లాడుతూ ఈ సినిమాలోని జిజెన్ చిక పాట చాలా అద్భుతంగా వచ్చిందని ప్రశంసించారు. రాహుల్ సిప్లిగంజ్ హై ఓల్టేజ్ వాయిస్ తో పాడిన ఈ పాట పెప్పిగా, మాస్ వైబ్ తో పండుగలు, పెళ్లిళ్లు, కాలేజ్ ఫంక్షన్లలో అందరూ ఎంజాయ్ చేసేలా ఉందని తెలిపారు. వరుణ్ సందేశ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్, చిత్ర దర్శకుడు రమేష్ జక్కల టేకింగ్, నిర్మాత ప్రసన్న లక్ష్మి భూమిరెడ్డి నిర్మాణ విలువలు సినిమాకు అదనపు బలంగా నిలుస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంతో పాటు రానున్న అన్ని పాటలు శ్రోతలను అలరిస్తాయని, సినిమా ఘన విజయం సాధించి నిర్మాతకు కాసుల వర్షం కురిపించాలని మనసారా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. వైవిధ్యమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. త్వరలోనే సినిమా విడుదల తేదీతో పాటు ప్రమోషన్ కార్యక్రమాలను మరింత వేగవంతం చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. వరుణ్ సందేశ్ కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేక నిలుస్తుందని, ఇందులో నటించిన ఇతర నటీనటుల పాత్రలు కూడా కథను మలుపు తిప్పుతాయని చిత్ర బృందం తెలిపింది. త్వరలో థియేటర్లలో సందడి చేయనున్న ఈ సినిమాపై టాలీవుడ్ లోనూ మంచి బజ్ ఏర్పడింది.