BREAKING
ప్రపంచ వనరుల సరఫరా గొలుసుపై సోయా, అరుదైన ఖనిజాల ప్రభావం! మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం

ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.

Select Suryaa Now
ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా.
సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి. ఇండో–శ్రీలంక మైత్రి సేతు అంతర్జాతీయ సైకిల్ యాత్రలో భాగంగా డిసెంబర్ 22న నిర్మల్ జిల్లాకు చేరుకోనున్న సైక్లింగ్ బృందానికి ఘన స్వాగతం పలికేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు.
జిల్లాకు చేరుకునే సైక్లింగ్ బృందానికి తగిన వసతి, ఆతిథ్య సౌకర్యాలు కల్పించాలని, భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. సైకిల్ యాత్ర ఆదిలాబాద్ జిల్లా వైపు వెళ్లేందుకు అనువైన రూట్ మ్యాప్‌ను రూపొందించాలని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో ముందస్తు ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు.ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్ర వంటి అంతర్జాతీయ కార్యక్రమాలు ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి దోహదపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. యాత్ర విజయవంతంగా సాగేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ, అవసరమైన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో ఇన్‌ఛార్జి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాథోడ్ రమేష్, ఏఎస్పీ ఉపేంద్ర రెడ్డి, డీఎంహెచ్‌వో రాజేందర్, డీవైఎస్‌వో శ్రీకాంత్ రెడ్డి, 32వ బెటాలియన్ ఎన్‌సీసీ ప్రతినిధి సంజీవ్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.