BREAKING
చారిత్రాత్మక శతకంతో రికార్డుల వేట సాగించిన ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ బంగ్లాదేశ్‌తో తొలి టెస్టు.. ఇంకా వంద ముప్పై ఎనిమిది పరుగుల వెనుకంజలో వెస్టిండీస్ తిరుపతిలో కూటమి హవా - ప్రచారంలో దూసుకుపోతున్న మేయర్ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ సౌతాఫ్రికాతో మూడో టెస్టులో కీలక ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా సెంచరీతో చెలరేగిన బెన్ డకెట్.. శ్రీలంక ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన ఇంగ్లండ్ కంబదూరులో రాజకీయ వేడి... జనసేన జడ్పిటిసి అభ్యర్థికి టిడిపి పూర్తి మద్దతు. ప్రజా సమస్యలను పరిష్కరించడమే నా ద్వేయం.. 16వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆర్. నాగభూషణం కటారి హేమలతను అత్యధిక మెజారిటీతో గెలిపించండి ఫైనాన్స్ ఆఫీసర్ గా సర్దార్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఐర్లాండ్ లెగ్ స్పిన్నర్ బెన్ వైట్ శ్రీరామలో మహిళల చెస్ క్రీడాకారుల ఎంపికలు టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన రికార్డుకు అడుగు దూరంలో తిరుచానూరులో చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి ఇంటింటి ప్రచారం కరోనా సేవలను గుర్తు చేసుకున్న స్థానికులు.. కుటమి అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి -జీవకోనలో శాప్ రవి నాయుడు విస్తృత ప్రచారం ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన జోష్ ఇంగ్లిస్

నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం

Select Suryaa Now
నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం

నువ్వురుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 
--ప్రజా సంక్షేమం సంకల్పం --టిడిపి అభ్యర్థి ఖాజావలి
ఆత్మకూరు,సోమా వెంకటసుబ్బయ్య,మేజర్ న్యూస్:
నువ్వురుపాడు మండల ప్రాదేశిక నియోజకవర్గం పరిధిలోని అన్ని గ్రామాల, కాలనీల అభివృద్ధి లక్ష్యంగా, అన్ని వర్గాల ప్రజా సంక్షేమమే సంకల్పంగా తాను ఎన్నికల్లో ఎంపీటీసీ స్థానం నుండి తెలుగుదేశం అభ్యర్థిగా కూటమి ఆధ్వర్యంలో పోటీ చేస్తున్నానని నువ్వురుపాడు సెగ్మెంట్ ఎంపీటీసీ టిడిపి అభ్యర్థి షేక్ ఖాజావలి పేర్కొన్నారు. తన వంతుగా ప్రజలకు సేవలు అందించాలన్న తపనతో, ఆకాంక్షతో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆశీస్సులతో నువ్వురుపాడు ఎంపిటిసి స్థానం నుండి కూటమి ఆధ్వర్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని,నువ్వురుపాడు సెగ్మెంట్ పరిధిలోని దేపూరు, నువ్వురుపాడు, ఎస్సీ, ఎస్టీ కాలనీలు తదితర అన్నిచోట్ల ప్రజలకు అవసరమైన రోడ్లు, సైడ్ కాలవలు ఏర్పాటు చేయించి అందరికీ త్రాగునీరు అందించేలా అన్ని ప్రాంతాల్లో వీధి దీపాలు ఉండేలా చేస్తానని ఖాజావలి పేర్కొన్నారు. మంత్రి ఆనం రామ నారాయణ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంను అనూహ్యంగా అభివృద్ధి చేస్తున్నారని,అభివృద్ధికి నిధులు సాధించడంలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అందివేసిన చేయి అని, ఆయన సహకారంతో నువ్వురుపాడు సెగ్మెంట్ అభివృద్ధికి తన వంతుగా ప్రత్యేక దృష్టి సారించి కృషి చేస్తానని ఖాజావలి పేర్కొన్నారు.తమ సెగ్మెంట్ పరిధిలోని అన్ని గ్రామాల, కాలనీల తెలుగుదేశం నాయకులు, కూటమి నాయకులు తనకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని, అన్ని వర్గాల ప్రజలు ప్రచారంలో ఆదరిస్తూ అండగా నిలుస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంపిటిసి పరిధిలోని ప్రజలందరూ ఆశీర్వదించి ఆనం రామనారాయణ రెడ్డి అభివృద్ధిని గుర్తించి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి తనకు విజయం చేకూర్చాలని, మండల తెలుగుదేశం జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ తూమాటి శశిధర్ రెడ్డికి అందరూ సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి విజయం చేకూర్చాలని ఖాజావలి కోరారు.