21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి
చిత్తూరు ప్రతినిధి మేజర్ న్యూస్. నగర పాలక సంస్థ పరిధి లోని 21వ డివిజన్ రెడ్డిగుంట, గంగాసాగరం తదితర ప్రాంతాల జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి వరలక్ష్మి ఎన్నికల ప్రచారాన్ని గురువారం ముమ్మరం చేశారు. డివిజన్‌లోని పలు వీధుల్లో పర్యటిస్తూ స్థానికులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా వరలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వం అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు తనకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రానున్న పుర ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
డివిజన్ సమస్యల పరిష్కారానికి హామీ
21వ డివిజన్ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని వరలక్ష్మి హామీ ఇచ్చారు. వీధి దీపాల ఏర్పాటు, మురుగునీటి కాలువల నిర్మాణం, సీసీ రోడ్ల అభివృద్ధితో పాటు తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించి డివిజన్ అభివృద్ధికి పాటుపడతానని పేర్కొన్నారు.ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.