BREAKING
మిల్వెంట్‌ నగరానికి దూరమవుతున్న ఉపాధ్యాయులు! గెలిచిన వెంటనే సమస్యలన్నీ పరిష్కరిస్తా -58వ డివిజన్ ప్రచారంలో రాజారెడ్డి హామీ మార్వెల్ ఆప్టికల్ ఒప్పందంపై విశ్లేషకుల ఆందోళన దిగ్గజ లా పర్మ్ 'వీల్' కుప్పకూలుదల..! ప్రచార జోరు పెంచిన పుష్పవతి -జీవకోన ప్రాంతంలో ఇంటింటికి విస్తృత ప్రచారం ముప్పై రోజుల పాటు ఉదయాన్నే కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే సోషల్ మీడియా యాప్‌లపై హెచ్చరిక లేబుల్స్.. రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలపై కోర్టుల్లో ముసలం! ప్రతిరోజూ ఒక అరటిపండు చొప్పున 45 రోజులు తింటే శరీరంలో జరిగే అద్భుత మార్పులు ఇవే భారత్‌లో బ్యాటరీ నిల్వ ప్రాజెక్ట్‌లపై దృష్టిసారించిన ఫ్రెంచ్ దిగ్గజం 'ఎంగీ'! మధురకు డాక్టరేట్ ప్రదానం గోరింటాకు పెట్టుకున్నాక చేతుల్లో మంట, దురద వస్తోందా.. ఈ జాగ్రత్తలు పాటిస్తే వెంటనే ఉపశమనం డేటా సెంటర్ల భారీ వృద్ధి..నార్వేలో తీవ్రమవుతున్న విద్యుత్ కొరత ఆందోళనలు! పిల్లలకు పదే పదే తీపి పానీయాలు ఇస్తున్నారా.. ఈ తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తప్పవు జ్ఞాన పరంపరకు అవధానం మూల స్తంభం గూగుల్‌పై అమెరికా ప్రభుత్వం సంచలన వ్యాజ్యం

గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత

Select Suryaa Now
గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి     జిల్లా కలెక్టర్ కె.హరిత
సూర్య ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి ఆసిఫాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, గంజాయి సాగు, రవాణాను అరికట్టాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఎన్ కార్ మాదకద్రవ్యాలను నియంత్రణపై నిర్వహించిన సమావేశానికి జిల్లా ఎస్.పి. నితికాపంత్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ హర్ష చౌదరి ఆసిఫాబాద్ రాజస్వ మండల అధికారి లోకేశ్వర్ రావు లతో కలిసి హాజరై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల రవాణా, గంజాయి సాగు, రవాణా అరికట్టడంలో అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. మాదకద్రవ్యాల నివారణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ సాగు, రవాణాకు సంబంధించిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు మాదక ద్రవ్యాలు తీసుకోవడం వల్ల కలిగే నష్టాలను వివరించాలని తెలిపారు. హోటళ్ళు, దాబా లలో తనిఖీలు చేపట్టాలని, మందుల షాపులలో నిషేధిత, అధిక మోతాదు మందులను పరిశీలించాలని తెలిపారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నషా ముక్త్ భారత్ అభియాన్ లో భాగంగా పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి తంబాకు రహిత విద్యాసంస్థలుగా మార్చాలని తెలిపారు.