BREAKING
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. 'కాళాంకి భైరవుడు' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. ఆవిష్కరించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్!

ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

Select Suryaa Now
ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

పోరాటాల ఖిల్లా నల్లగొండలో రైతులు, యువత భారీగా తరలిరావాలి: డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవి నాయక్

మిర్యాలగూడ అర్బన్, మేజర్ న్యూస్: పోరాటాల పురిటిగడ్డ, వీర తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కలిగిన నల్లగొండ జిల్లాలో నిర్వహిస్తున్న ఏఐకేఎస్ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు మూడావత్ రవి నాయక్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా భారత విద్యార్థి సమాఖ్య (ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్‌ఐ) ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో ఏఐకేఎస్ జాతీయ మహాసభలు నిర్వహించడం గర్వకారణమన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఏఐకేఎస్ జాతీయ సంఘం రైతుల పక్షాన నిరంతరం పోరాటం చేసిందని తెలిపారు. రైతుల ఐక్య పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాలను వెనక్కి తీసుకునేలా ఉద్యమం సాగిందని పేర్కొన్నారు.

నవంబర్ 15వ తేదీన నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు రైతులు, యువకులు, మేధావులు వేలాదిగా తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. అదే రోజు నిర్వహించే రెడ్‌షర్ట్ వాలంటీర్ల కవాతులో యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 12 రకాల నిత్యావసర సరుకులను అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ మహాసభలు, బహిరంగ సభలో రైతులు, యువత, మేధావులు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుర్ర సైదా నాయక్, జిల్లా కమిటీ సభ్యులు జగన్, వీరన్న, సంపత్, డీవైఎఫ్‌ఐ నాయకులు ఆశీర్వాదం, రవి నాయక్, సమీర్, కార్తీక్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.