మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ కే మన ఓటు - తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచార జోరు ... -మేయర్ గా హేమలతకు భారీ మెజారిటీ లక్ష్యం!
చిత్తూరు అర్బన్, మేజర్ న్యూస్:
చిత్తూరు నగరం 28వ వార్డు తేనెబండలో కార్పొరేటర్ తేజశ్రీ పచ్చప్ప ప్రచారం జోరుగా సాగుతోంది. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు గురువారం తేనెబండలో ఇంటింటికీ తిరిగి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.గత రెండున్నరేళ్లలో తేనెబండలో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, మంచినీటి బోర్ల ఏర్పాటు వంటి మౌలిక సదుపాయాల పనులు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆధ్వర్యంలో జరిగాయని తెలిపారు. అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ప్రజలను కోరారు.ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ నాయకత్వంలోనే చిత్తూరు నగరం అభివృద్ధి బాటలో పయనిస్తోందని, మేయర్ గా కటారి హేమలత గెలిస్తే అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని చెబుతున్నారు. మన వార్డు.. మన అభివృద్ధి.. సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ ప్రచారం సాగిస్తున్నారు. మేయర్ గా హేమలతను భారీ మెజారిటీతో గెలిపించాలని తేనెబండ ప్రజలను విజ్ఞప్తి చేశారు.ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికీ తిరుగుతూ ఓటర్లను కలుస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. వార్డు సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తామని భరోసా ఇస్తున్నారు. మేయర్ అభ్యర్థి కటారి హేమలతకు తేనెబండలో బ్రహ్మరథం పడుతోంది.ఈ ప్రచారంలో తెదేపా ప్రధాన కార్యదర్శి పచ్చప్పతో పాటు 28వ వార్డు నాయకులు అశోక్, రాజు, మూర్తి, వార్డు నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వార్డులో తేజశ్రీ పచ్చప్పకు మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది.
చిత్తూరు అర్బన్ రిపోర్టర్, లవకుమార్