BREAKING
కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. 'కాళాంకి భైరవుడు' నుంచి థర్డ్ సింగిల్ రిలీజ్.. ఆవిష్కరించిన రాకింగ్ స్టార్ మంచు మనోజ్!

గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

Select Suryaa Now
గౌతమ్ నగర్‌లో పొంగిపొర్లుతున్న డ్రైనేజీ

పటాన్ చెరు, ;  పటాన్‌చెరు పట్టణములోని గౌతమ్ నగర్ లోని శాంతినికేతన్ స్కూల్ సమీపంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అధ్వానంగా మారింది. గత నాలుగు రోజులుగా డ్రైనేజీ మురుగునీరు రోడ్డుపై పొంగిపొర్లుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్  ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్యంతో గత నాలుగు రోజులుగా డ్రైనేజీ పైప్ లైన్ నిండిపోయి మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా క్లీన్ చేయకపోవడంతో రోడ్డుపై ప్రవహించడంతోపాటు దుర్వాసన రావడంతో పాఠశాలకు వచ్చే వందలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మురుగునీరు రోడ్డుపై ప్రవహించడం వల్ల పరిసర ప్రాంతాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్తడంతో పాటు విద్యార్థుల ఆరోగ్యంపై కూడా పడుతుందని  ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యపై సంబంధిత అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ సరైన స్పందన రావడం లేదని ఆరోపించారు. ఒక పాఠశాల పరిసరాల్లోనే పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే, కాలనీలో  పరిస్థితి ఎలా ఉందో అధికారులు ఆలోచించాలన్నారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు ఇప్పటికైనా తక్షణం స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులను ఆయన కోరారు.