BREAKING
మున్నూరు కాపు  పటేల్స్ సంఘం ఎన్నికల రాష్ట్ర కోఆర్డినేటర్ గా కాస రాజు పటేల్ నియామకం కొండగట్టు అంజన్న హుండీ ఆదాయం కోటి 23 లక్షలు. పోక్సో చట్టంపై విద్యార్థిని విద్యార్థులకు అవగాహన తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ రక్తదాన శిబిరం కార్యాక్రమం నిర్వహించిన పోలీస్ కమిషనర్... ఎయిడ్స్ నియంత్రణలో కామారెడ్డి జిల్లా బేష్ కలెక్టర్ ను అభినందించిన కేంద్రం మాధవనగర్ ఆర్వోబి పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలుకు తీవ్ర ఇబ్బందులు జిల్లాలో క్షయ వ్యాధిని నిర్మూలించాలి జిల్లా కలెక్టర్ కె.హరిత నువ్వూరుపాడు సెగ్మెంట్ అభివృద్ధి లక్ష్యం 21వ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తా జనసేన అభ్యర్థి వరలక్ష్మి ఇండో–శ్రీలంక మైత్రి సేతు సైకిల్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి. : జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా. గంజాయి సాగు, రవాణాను అరికట్టాలి జిల్లా కలెక్టర్ కె.హరిత భారీ సెటిల్‌మెంట్‌ కింద 220 మిలియన్ డాలర్లు చెల్లించనున్న ఆటోమొబైల్ దిగ్గజం జీఎం! జిల్లాలో రహదారి ప్రమాదాలను నివారించాలి... జిల్లా కలెక్టర్ కె.హరిత ఆదరించండి సెగ్మెంట్ అభివృద్ధికి కట్టుబడి ఉంటాం.

లౌకిక విధానంతో ముందుకు సాగుదాం

Select Suryaa Now
లౌకిక విధానంతో ముందుకు సాగుదాం

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంస్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అనపర్తి మండలం పొలమూరులో మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులతో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండున్నరేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తనను అత్యధిక మెజారిటీతో గెలిపించడంలో క్రైస్తవ మత పెద్దలు, పాస్టర్ల సహకారం కీలకమని తెలిపారు. నాలుగు మండలాల్లో పాస్టర్స్ ఫెలోషిప్ భవనాల నిర్మాణానికి స్థలాలు కేటాయించి, దశలవారీగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బిక్కవోలులో ఇప్పటికే స్థలాన్ని ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.నియోజకవర్గంలో అన్ని మతాల ప్రజలు సామరస్యంగా జీవించే వాతావరణాన్ని కొనసాగిస్తున్నామని, భారతదేశ లౌకిక విధానానికి అనుగుణంగానే తన పాలన ఉంటుందని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు స్థానిక సంస్థల్లోనూ కూటమి ప్రజాప్రతినిధులు ఎన్నికైతే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని, ట్రిపుల్ ఇంజిన్ ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు మరింత ఊతం లభిస్తుందని అన్నారు. గత రెండున్నరేళ్లలో నియోజకవర్గంలో సుమారు రూ.1,200 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. రాబోయే పరిషత్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని పాస్టర్స్ ఫెలోషిప్ సభ్యులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండల పాస్టర్స్ ఫెలోషిప్ అసోసియేషన్ సభ్యులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ కూటమి అభ్యర్థులు, మండల కూటమి నాయకులు పాల్గొన్నారు.